Home » “మర్యాద రామన్న” సినిమాలోని హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? ఏం చేస్తోందంటే?

“మర్యాద రామన్న” సినిమాలోని హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? ఏం చేస్తోందంటే?

by Bunty
Ad

 

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కమెడియన్లలో స్టార్ కమెడియన్ గా పేరు పొందారు సునీల్. ఓవైపు కామెడీ పాత్రలు చేస్తూనే అందరిని మెప్పించిన సునీల్ హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చి మంచి మార్కులు కొట్టేశాడు. అలాంటి హీరో అండ్ కమెడియన్ సునీల్ కెరియర్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మూవీ మర్యాద రామన్న. ఈ మూవీ జక్కన్న దర్శకత్వంలో సునీల్ హీరోగా చేసిన మూవీ.

READ ALSO : Pathaan Movie Review : “పఠాన్” మూవీ రివ్యూ

Advertisement

1.20 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ చితం దాదాపు 4 కోట్ల కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందని చెప్పవచ్చు. ఇక ఈ మర్యాద రామన్న సినిమాతో తన నటనకు గాను మంచి గుర్తింపు తెచ్చుకుంది సలోని. తెలుగులో పదికి పైగా సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ, పెద్దగా లైమ్ లైట్ లోకి రాలేకపోయింది. స్టార్ హీరోలతో నటించిన కూడా ఆమెకు సరైన అవకాశాలు తలుపుతట్టలేదు.

Advertisement

ఒక ఊరిలో, చుక్కల్లో చంద్రుడు, బాస్, మగధీర, మర్యాదరామన్న, బాడీగార్డ్, ఆదినాయకుడు, రేసుగుర్రం, సలోని కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు. ఇక 2016లో మీలో ఎవరు కోటీశ్వరుడు ఆమె నటించిన చివరి చిత్రం. ఆ తర్వాత పూర్తిగా సినీ ఇండస్ట్రీకి దూరమైంది. కాగా, మహారాష్ట్రకు చెందిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ముంబైలో తన కుటుంబంతో కలిసి నివసిస్తుంది. ఆమె తండ్రి నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్నాడు. అటు ఈ అమ్మడు పెళ్లికి కూడా దూరంగానే ఉంది.

READ ALSO : Venkatesh 75 : వెంకటేష్‌ ఫస్ట్ పాన్‌ ఇండియా మూవీ! అదిరిపోయిన ‘సైంధవ్‌’ గ్లింప్స్!

Visitors Are Also Reading