తెలంగాణ పోలీస్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం నియామకాల ప్రక్రియ రెండు దశలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న మహిళల్లో గర్భిణీ, డెలివరీ మహిళల కోసం ఇటీవల పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గర్భంతో ఉన్న మహిళలకు, ఇటీవల డెలివరీ అయినా మహిళలకు ఈవెంట్స్ నుంచి మినహాయింపు ఇస్తూ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
Advertisement
ఈ మేరకు గర్భిణీలకు నేరుగా మెయిన్స్ రాసేలా వెసులుబాటు కల్పించింది. ఒకవేళ ఆ మెయిన్స్ పాస్ అయితే నెల రోజుల్లోపు వారికి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించనున్నట్టు పోలీస్ శాఖ తెలిపిన సంగతి తెలిసిందే. దాని గురించి ఈ పోలీస్ నియామక బోర్డు మరో నోటీస్ విడుదల చేసింది. హైకోర్టు నుంచి అందిన ఆర్డర్ కాపీ జనవరి 19, 2023 ప్రకారం, ఎవరైతే ప్రెగ్నెంట్ మహిళ ఇటీవల డెలివరీ అయిన మహిళలు ఉంటారో వాళ్లు అండర్ టేకింగ్ ఇవ్వాలని తెలిపారు.
Advertisement
మెయిన్స్ పరీక్ష ముగిసిన ఒక నెలలోగా తాము ఈవెంట్స్ లో పాల్గొంటామని అందులో పేర్కొనాలని తెలిపారు. అంతేకాకుండా బోనఫైడ్ మెడికల్ సర్టిఫికేట్ ను జనవరి 31, 2023 లోగా బోర్డుకు అందించాలని తెలిపారు. అంటే గర్భిణ మహిళలు సంబంధిత ఆసుపత్రి నుంచి గర్భధారణ వైద్య ధ్రువీకరణ పత్రం లేదా బిడ్డకు జన్మనిచ్చిన సర్టిఫికెట్ పొంది, హైదరాబాద్ లక్డీకపూల్ లోని ఇన్వార్డ్ సెక్షన్ లో అదే సమర్పించాలన్నారు. సమర్పణకు చివరి తేదీ జనవరి 31, 2023 గా పేర్కొన్నారు. ఇది ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు.
read also : పవన్ కళ్యాణ్ 3వ భార్య ఆస్తులు విలువ తెలుసా? ఎంతో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే !