Home » సుమ షోలో చిరంజీవి… మెగాస్టార్ ఎంట్రీకి అదే కార‌ణ‌మా…!

సుమ షోలో చిరంజీవి… మెగాస్టార్ ఎంట్రీకి అదే కార‌ణ‌మా…!

by Bunty
Ad

మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది సంక్రాంతి బరిలోకి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాస్ మహారాజా రవితేజ ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మెగా మాస్ పూనకాల కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 13న రిలీజ్ చేయబోతున్నారు.

Advertisement

ఇది ఇలా ఉండగా, సుమ చేసిన షోస్ లో క్యాష్ షో చాలా పాపులర్ అయింది. ఇందులో ఎంతోమంది సెలబ్రిటీలు సందడి చేశారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ స్టార్స్ వరకు హాజరయ్యారు. అయితే ఇటీవలే ఆ షోకు ఫుల్ స్టాప్ పెట్టి, ‘సుమ అడ్డా’ అనే కొత్త షోను స్టార్ట్ చేసింది. దీని గురించి చెప్పడం కోసం డిఫరెంట్ గా ట్రై చేసి, విమర్శల పాలయ్యారు. ఇక సుమ అడ్డ తొలి ఎపిసోడ్ కి సంబంధించి ఇప్పటికే ప్రోమో వదిలారు. సంతోష్ శోభన్ టీం తొలి ఎపిసోడ్ లో సందడి చేశాడు.

Advertisement

ఇక రెండో ఎపిసోడ్, సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రసారం కానుందట. ఈ క్రమంలో రెండో ఎపిసోడ్ కి మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబి గెస్ట్ లుగా రానున్నారని టాక్. చిరంజీవి, బుల్లితెర మీద ఓ గేమ్ షో లాంటి దానికి హాజరు కావడం పెద్ద విషయమే. గతంలో ఆహాలో సమంత చాట్ షోలో ఆయన పాల్గొన్నారు. అయితే అది టాక్ షో మాత్రమే కాక, ఓటిటి వేదికగా టెలికాస్ట్ అయ్యింది. హోస్ట్ కూడా స్టార్ హీరోయిన్ సమంత. కాబట్టి చిరంజీవి, ఆ షో కి హాజరవ్వడం ఎవరిని ఆశ్చర్యపరచలేదు. అలాంటిది చిరు బుల్లితెర మీద గేమ్ షోలో పాల్గొని సందడి చేయడం మాత్రం చాలా ప్రత్యేకమే. మరి బుల్లితెర మీద చిరంజీవి సందడి ఎలా ఉండబోతుందో చూడాలంటే మరికొన్ని ఆగాలి.

ఇవి కూడా చదవండి  : యాంకర్ శ్రీ ముఖి పెళ్లి ఫిక్స్..ప్రముఖ వ్యాపారవేత్తతో వివాహం ?

Visitors Are Also Reading