Telugu News » Blog » యాంకర్ శ్రీ ముఖి పెళ్లి ఫిక్స్..ప్రముఖ వ్యాపారవేత్తతో వివాహం ?

యాంకర్ శ్రీ ముఖి పెళ్లి ఫిక్స్..ప్రముఖ వ్యాపారవేత్తతో వివాహం ?

by Bunty
Ads

బుల్లితెరపై యాంకర్లుగా రాణించిన చాలామంది సినిమాలలోనూ రాణిస్తున్నారు. శ్రీముఖి అలియాస్ రాములమ్మగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పటాస్ షో ద్వారా యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన శ్రీముఖి ఆ తర్వాత తన చలాకీతనంతో మంచి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక సినిమాలలో కూడా నటించి మరింత పాపులారిటీని దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా బుల్లితెరపైనే తన స్థానాన్ని పదిలం చేసుకునే పనిలో పడింది.

Advertisement

ఇది ఇలా ఉంటే, యాంకర్ శ్రీముఖి కూడా గతంలో సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. జులాయి సినిమాలో శ్రీముఖి అల్లు అర్జున్ కు చెల్లిగా నటించింది. అయితే ఇప్పుడు మాత్రం శ్రీముఖి పెళ్లి కచ్చితంగా జరగనుందని, త్వరలో అధికారికంగా శ్రీముఖి పెళ్లి ప్రకటన కచ్చితంగా రానుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. శ్రీముఖికి పెళ్లి ఫిక్స్ అయిందని ఆమె సన్నిహితుల నుంచి సమాచారం అందుతుంది.

Advertisement

ప్రముఖ వ్యాపారవేతతో శ్రీముఖి డేటింగ్ లో ఉన్నారని బోగట్ట. ఆ వ్యాపారవేత్తకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని సమాచారం అందుతుంది. శ్రీముఖితో పెళ్లికి ఆ వ్యాపారవేత్త కుటుంబం కూడా అంగీకరించిందని తెలుస్తోంది. త్వరలో శ్రీముఖి తాను పెళ్లి చేసుకునే వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తం అవుతూ ఉండటం గమనార్హం.

Advertisement

Read also : దేవుడు లాంటి కృష్ణ గారితో తనకు సంబంధం అంటగట్టారు.. రమ్య రఘుపతి సంచలనం