ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలతో ముందుకెళ్తోంది. తాజాగా రైతుల కోసం ఉచిత బోరు బావులు తవ్వకం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ప్రారంభానికి సీఎం జగన్మోహన్ రెడ్డి వివిధ జిల్లా కలెక్టర్లతో, రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అర్హులైన రైతులందరికీ ఉచిత బోర్ల ద్వారా మెట్ట ప్రాంత భూముల్లో నీరు అందించడమే లక్ష్యంగా వైయస్సార్ జలకళా పథకాన్ని ప్రారంభించామన్నారు. అయితే రైతులకు నీళ్ల సదుపాయం ఉన్నాయా లేదా అనేది గుర్తిస్తామని తెలియజేశారు.
Advertisement
ALSO READ;రైతన్న కు గుడ్ న్యూస్: భారీగా రుణమాఫీ.. కీలక నిర్ణయం తీసుకున్న కేసీఆర్..!!
ముఖ్యంగా రైతులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని లేదంటే వాలంటీర్ల సహకారంతో గ్రామ సచివాలయాలు దరఖాస్తుల స్వీకరిస్తామని తెలియజేశారు. రైతు బోర్ వేయడానికి కావలసిన ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని, ఒకవేళ మొదటి బోరు కూడా విఫలమైతే రెండవ బోరు కూడా వేసేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలియజేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల మంది రైతులకు ఉచితంగా వ్యవసాయ బోర్లు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. వైయస్సార్ జలకల కోసం ప్రభుత్వం 2,340 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుందని, ఈ పథకానికి అర్హులైన వారు పట్టాదారు పాసుబుక్, ఆధార్ కార్డు కాపీ తో సచివాలయాలు దరఖాస్తు చేసుకోవాలని అంటున్నారు.
Advertisement
అంతేకాకుండా ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. ఈ విధంగా దరఖాస్తులను గ్రామ సచివాలయాల్లో వీఆర్వో పరిశీలించి, దానిని భూగర్భ జల సర్వే కోసం జియాలజిస్ట్ కు పంపుతారు. ఆ తర్వాత ఈ విభాగం పరిశీలించి అనుమతి ఇవ్వగానే అసిస్టెంట్ పిడి సదరు దరఖాస్తును పరిపాలన అనుమతి ఇస్తారు. ఈ విధంగా రైతు పొలానికి వెళ్లి బోరుబావులను వేస్తారు. ఆ బోరు సక్సెస్ రేటును బట్టి కాంట్రాక్టర్ కు బిల్లుల చెల్లింపులు ఉంటాయట. ఈ బోరుకు అప్లై చేసుకునే వారు అంతకుముందు పొలంలో ఎలాంటి బోరు ఉండకూడదు. ఏ రోజైతే రైతు పొలంలో బోరు వేస్తారో వెంటనే రైతు ఫోన్ కు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారంగా అందిస్తారు.
ALSO READ;18 పేజెస్ మూవీలో బ్రహ్మాజీకి అవమానం.. ఎలా భరించావయ్యా..?