Home » రైతన్న కు గుడ్ న్యూస్: భారీగా రుణమాఫీ.. కీలక నిర్ణయం తీసుకున్న కేసీఆర్..!!

రైతన్న కు గుడ్ న్యూస్: భారీగా రుణమాఫీ.. కీలక నిర్ణయం తీసుకున్న కేసీఆర్..!!

by Sravanthi Pandrala Pandrala

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అనేక పథకాలు ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ సర్కార్ శర వేగంగా దూసుకుపోతోంది. ఇందులో ముఖ్యంగా రైతుల కోసం అనేక ప్రయోజనాలు అందిస్తోంది. ఇప్పటికే రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, పంట రుణాలు, ధాన్యం కొనుగోలు, వ్యవసాయ పరికరాలపై సబ్సిడీ వంటి పథకాలను రైతులకు అందిస్తూ కెసిఆర్ సర్కార్ రైతన్నలకు పెద్ద పీట వేస్తూ ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే కెసిఆర్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం..

ALSO READ;ఏడాదిలోపు పిల్లలు ఉన్నారా.. ఫుడ్ విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

2023లో రైతన్నలకు గుడ్ న్యూస్ చెప్పనున్నారు కేసీఆర్.. రైతుల రుణమాఫీ విషయంలో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. బ్యాంకు రుణాలు మరియు రైతు బీమా ఇతర అవసరాల కోసం ఒక కుటుంబంలో ఇద్దరు నుంచి ముగ్గురు చొప్పున పంపకాలు చేసుకున్న భూములను దృష్టిలో పెట్టుకొని .. దాదాపుగా 75 వేల నుంచి లక్ష రూపాయల వరకు బకాయిలు ఉన్న రైతు రుణాలను మాఫీ చేయడం కోసం కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు.కానీ కొత్త సంవత్సరంలో రాబోతున్నట్టు తెలుస్తోంది. ఒక ఫ్యామిలీలో ఎంతమంది పేరున వ్యవసాయ భూమి ఉన్నా ఆ భూమిపై ఎన్ని బ్యాంకుల్లో రుణాలు ఉన్నా కానీ యజమాని ఒక్కరికి రుణ విముక్తి పథకం వర్తించేలా కఠిన నిబంధనలు చేయాలని కేసిఆర్ సర్కార్ భావిస్తోందని సమాచారం. అయితే దీనిపై వచ్చే కొత్త సంవత్సరంలో అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.

ALSO READ;అంత్యక్రియల్లో కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు… ఎందుకో తెలుసా?

Visitors Are Also Reading