Home » 18 పేజెస్ మూవీలో బ్రహ్మాజీకి అవమానం.. ఎలా భరించావయ్యా..?

18 పేజెస్ మూవీలో బ్రహ్మాజీకి అవమానం.. ఎలా భరించావయ్యా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

డిసెంబర్ 23న రిలీజ్ అయి మంచి టాక్ తో దూసుకుపోతున్న మూవీ 18 పేజెస్.. నిఖిల్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. మొదటి రోజే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాను జిఏ 2 పిక్చర్స్ సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన విషయం మనందరికీ తెలుసు. ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా 18 కోట్లకు వచ్చిందట. ఈ తరుణంలో నాన్ థియేట్రికల్ రన్ తోనే 20 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్టు సమాచారం.

Advertisement

ALSO READ;రేటు పెంచేసిన ధమాకా బ్యూటీ…! ఒక్క సినిమాకే అన్ని కోట్లు డిమాండ్ చేస్తుందా..?

ఈ విధంగా సక్సెస్ ఫుల్ దూసుకుపోతున్న ఈ మూవీలో బ్రహ్మాజీ పాత్ర గురించి ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో నటుడు బ్రహ్మాజీకి ఘోర అవమానం జరిగినట్లు కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటో చూద్దాం.. సాధారణంగా కొన్ని చిత్రాలలో నిడివి ఎక్కువైతే షూట్ చేసిన పాత్రలకు సంబంధించిన సన్నివేశాలను డిలీట్ చేస్తూ ఉంటారు. దీంతో 18 పేజెస్ సినిమా లో బ్రహ్మాజీ ట్రైలర్ లో చూపించిన పాత్రను డిలీట్ చేయడం ఏంటని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఓవర్సీస్ ప్రింట్లలో బ్రహ్మాజీ కి సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయని, ఇండియాలో మాత్రం లేవంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన అభిమానులంతా బ్రహ్మాజీకి అవమానం జరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో బ్రహ్మాజీ నాలుగైదు సన్నివేశాలలో మాత్రమే కనిపిస్తారని, కానీ ఆ సన్నివేశాలు ఎడిటింగ్ లో పోయాయని సమాచారం అందుతుంది. మరి ఇదే విషయంపై నటుడు బ్రహ్మాజీ ఏవిధంగా స్పందిస్తారో ముందు ముందు తెలుస్తుంది. ఇక మూవీ విషయానికొస్తే సక్సెస్ఫుల్ టాక్ తో దూసుకుపోతుంది. నిఖిల్ ఖాతాలో మరో సూపర్ హిట్ మూవీ పడ్డట్టే అని అంటున్నారు ప్రేక్షకులు.

ALSO READ;Prabhas : రూ. 21 కోట్లు అప్పు తీసుకున్న ప్రభాస్.. షాక్ లో ఫ్యాన్స్.. !

Visitors Are Also Reading