ప్రస్తుతం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఆసియా కప్ పాకిస్తాన్లో జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా పాకిస్తాన్ గడ్డపై అడుగు పెట్టాలని ఆ బోర్డు ఒత్తిడి తెస్తోంది. ఇటు టీమిండియా మాత్రం తాము పాక్ .. వెల్లబోమని కుండబద్దలు కొట్టి చెబుతోంది. ఈ తరుణంలో టీమిండియా కు మరో షాక్ తగిలింది. వన్డే ప్రపంచ కప్ 2023 కి భారత ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే భారత అభిమానులకు శుభవార్త కానుంది. అయితే, హ్యాపీ మూమెంట్స్ ని అంతలోనే ఆవిరయ్యేలా మారిపోయాయి.
Advertisement
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 ఆతిథ్యం భారతదేశం నుంచి తరలిపోయే అవకాశం ఉంది. ఒకవైపు, పాకిస్తాన్ నిరంతరం బీసీసీఐ ని లక్ష్యంగా చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు పన్నుల విషయంలో భారత ప్రభుత్వంతో బీసీసీఐ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. అయితే, వివాదాస్పద సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఐసీసీ, బీసీసీఐ కి కఠినమైన ఆదేశాలు ఇచ్చింది. ఇది జరగకపోతే వన్డే ప్రపంచ కప్ 2023 ఆతిథ్యన్ని భారతదేశం నుంచి లాక్కోవచ్చని తెలుస్తోంది.
Advertisement
అసలు వివాదం ఏంటి?
భారతదేశం ఇంతకుముందు టీ 20 ప్రపంచ కప్ 2016 కి ఆతిథ్యం ఇచ్చింది. అయితే, భారత ప్రభుత్వంతో బీసీసీఐ పన్ను వివాదం పరిష్కారం కాలేదు. ఆ తర్వాత బీసీసీఐ వార్షిక సొమ్ము నుంచి రూ. 190 కోట్లను ఐసిసి మినహాయించింది. నిజానికి, ఐసీసీ పన్ను బిల్లును 21.84 శాతానికి అంటే రూ. 116 మిలియన్లకు పెంచడం ఇదే మొదటిసారి. ఈ ధరను భారత రూపాయలలో చూస్తే దాదాపు రూ. 900 కోట్లు అవుతుంది.
అయితే బీసీసీఐకి, భారత ప్రభుత్వానికి మధ్య పన్నుల వివాదం ఎప్పటికీ పరిష్కారం అవుతుందో రానున్న రోజుల్లో తేలిపోనుంది. అయితే ఇవి భారత్ కు మంచి సంకేతాలు కావు. వివాదాస్పద సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఐసీసీ, బీసీసీఐకి ఖటినమైన ఆదేశాలు ఇచ్చింది. ఇది జరగకపోతే, వన్డే ప్రపంచ కప్ 2023 ఆతిథ్యాన్ని భారతదేశం నుంచి లాక్కొని వేరే దేశానికి ఇవ్వవచ్చని తెలుస్తోంది.