ప్రస్తుతం దేశంలో చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుంది. కాస్త చీకటి పడిందంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్లడానికి అందరూ భయపడుతున్నారు. చలితో గజగజ వణుకుతున్నారు. చలి తీవ్రత ఎక్కువయ్యి జలుబు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.కాబట్టి చాలామంది చలి నుంచి బయటపడడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగా చూసుకుంటే మగవాళ్ళ కంటే ఆడవారికి చలి ఎక్కువగా పెడుతుందట. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనికి కారణం ఏంటో చూద్దాం.
Advertisement
also read;అన్ స్టాపబుల్-2 ప్రభాస్ ప్రోమో అదిరిపోయిందిగా.. డార్లింగ్ పెళ్లి డేట్ ఫిక్స్..!
Advertisement
సాధారణంగా పురుషులతో పోలిస్తే స్త్రీలలో మెటబాలిజం స్థాయి తక్కువగా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. అందుకే మగవారి కంటే ఆడవారికి ఎక్కువగా చలి పెడుతుందట. అంతేకాకుండా మగవారితో పోలిస్తే ఆడవారికి కండరాలు చాలా తక్కువగా ఉంటాయి.దీని వల్ల కూడా ఆడవారికి చలిగా అనిపిస్తుందని నిపుణులు అంటున్నారు. కండరాలు పెద్దగా ఉండటం వల్ల చలి అనిపించదు. శరీరం వెచ్చగా ఉంటుంది.
అంతేకాకుండా మగవారితో పోల్చుకుంటే ఆడవారి శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉంటాయని, దీనివల్ల వారికి కొంచెం చల్లగా ఉన్నా ఎక్కువ చలిగా అనిపిస్తుందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా సాధారణ ఉష్ణోగ్రత వద్ద కూడా చాలా ఎక్కువగా చలిపెడితే దాన్ని కామన్ గా తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వెంటనే హాస్పిటల్ కి వెళ్లి చూయించుకోవడం మంచిదని లేకపోతే ఇది ఇతర రోగాలకు సాంకేతం అని అంటున్నారు వైద్యనిపుణులు.
aslo read;మెగాస్టార్ మొదటి పారితోషికం తెలిస్తే ఆశ్చర్యపోతారు..?