టాలీవుడ్ సీనియర్ నటులలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణ తన నట ప్రస్థానంలో ఎన్నో మరుపురాని చిత్రాల్లో నటించారు. కలర్, డీటీఎస్, సినిమా స్కోప్, 70 ఎంఎం ఇలా సాంకేతిక పరిజ్ఞానంతో తెలుగు సినిమాకి కొత్త సొగసులు అద్దారు కృష్ణ. 1965లో తేనే మనుషులు అనే సినిమాతో బ్రేక్ వచ్చిన తరువాత.. కృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం అవే కళ్లు. అయితే ఈ చిత్రం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తెరకెక్కిన ఫస్ట్ కలర్, సస్పెన్స్ థ్రిల్లర్ కావడం విశేషం. ఈ సినిమాలో కాంచన, గీతాంజలి, పద్మనాభం, గుమ్మడి, రాజనాల, నాగభూషణవం వంటి వారు ప్రధాన పాత్రలలో నటించారు.
Advertisement
ఏవీఎం సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ఏ.సీ. త్రిలోక్ చందర్ దర్శకత్వం వహించారు. 1967 డిసెంబర్ 14న విడుదలైన ఈ చిత్రం 2022 డిసెంబర్ 14 నాటికి 55 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. 1966లో గూఢచారి 116లో సీక్రెట్ ఏజెంట్ గా నటించి మెప్పించిన కృష్ణకు ఆ తరువాత ఏడాది అవేకళ్లు వంటి సస్పెన్స్ థ్రిల్లర్ లో నటించే అవకాశం దక్కడం విశేషం. కథ చెప్పగానే థ్రిల్ అనిపించదు. కానీ ఇప్పటి ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే సినిమా అవేకళ్లు సినిమా అని చెప్పవచ్చు.
Advertisement
Also Read : Veera simha reddy: వీరసింహారెడ్డిలో ఆ పాత్రే హైలెట్ అవ్వనుందా..?
జంట హtyaలు, బెదిరింపులకు పాల్పడుతున్న నల్ల ముసుగు వ్యక్తిని.. కేవలం కళ్లు ఆధారంగా కనిపెట్టడమే ఈ చిత్రం కథ అని ముందుగా హింట్ ఇచ్చినప్పటికీ స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసి ప్రేక్షకులను కట్టిపడేశారు దర్శకులు త్రిలోక్ చందర్. లవ్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామాతో పాటు ఉత్కంఠకు గురి చేసే అంశాలతో రూపొందించారు. ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణను పొందింది. తొలి తెలుగు కలర్, సస్పెన్స్ థ్రిల్లర్ కావడంతో తమిళనాడులో కూడా కలర్ లోనే రవిచంద్రన్,కాంచన జంటగా తీశారు. గీతాంజలి అదే పాత్రను తమిళంలో కూడా చేసింది. ఈ మిస్టరీ థ్రిల్లర్ పిక్చర్ కోలీవుడ్ లో “అదే కంగల్” పేరుతో 1967 మే 26న విడుదలై మంచి సక్సెస్ సాధించింది. సరిగ్గా ఏడు నెలల తరువాత ఈ చిత్రం తెలుగులో విడుదలై ఘన విజయం సాధించింది. తెలుగులో తెరకెక్కిన తొలి కలర్ థ్రిల్లర్ చిత్రంగా “అవేకళ్లు” రికార్డునే క్రియేట్ చేసింది.
Also Read : నటి అభినయకు జైలు శిక్ష.. ఒక ఆడపిల్ల మరో ఆడపిల్లకు అన్యాయం చేసిన వేళ..!!