సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్ లు కోట్లు సంపాదించుకున్నారు. అయితే సంపాదించుకున్న డబ్బును సరిగ్గా ఖర్చు చేస్తేనే బాగుపడతారు. లేదంటే దివాలా తీయాల్సిన పరిస్థితులు రావడం పక్కా. ముఖ్యంగా ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు నటన ద్వారా సంపాదించి నిర్మాతలుగా మారి నష్టపోయారు. అలా కొంతమంది అందాల తారలు కూడా నష్టపోయారు. వాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం…రీసెంట్ నటి ఛార్మి లైగర్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించి కోట్ల రూపాయలను నష్టపోయారు.
Also Read: 2022లో గూగుల్ లో అత్యధికంగా వెతికిన 10 ఇండియన్ సినిమాలు..నంబర్ 1 స్థానంలో ఏ సినిమా ఉందంటే..?
Advertisement
గతంలో ఛార్మీ స్టార్ హీరోయిన్ గా రానించిన సంగతి తెలిసిందే. అయితే పూరీ జగన్నాత్ తో కలిసి ఛార్మీ నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన ఛార్మి లైగర్ ఫ్లాప్ తో 20 ఏళ్లు సంపాదించిన ఆస్తిని పోగొట్టుకున్నారు. మహానటి సావిత్రి చిన్నవయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. సావిత్రి పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టడమే కాకుండా నిర్మాణ రంగంలోనూ డబ్బులు పెట్టారు.
అయినవాళ్లే మోసం చేయడం…సావిత్రి నిర్మించిన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఆమె కూడా కెరీర్ లో దివాలా తీశారు. చిన్నారి పాపలు అనే సినిమాతో సావిత్రి లక్షల్లో నష్టపోయారు.
Advertisement
నటి జయసుధ భర్త నిర్మాత అన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రానించిన జయసుధ కూడా తన భర్తతో కలిసి సినిమాలను నిర్మించారు. కానీ ఆ సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో జయసుధ కోట్లల్లో ఆస్తులు పోగొట్టుకున్నారు. ఒక్కుడు, ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో భూమిక స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.
అయితే ఆ తరవాత నిర్మాతగా మారి తకిటతకిట సినిమాతో కోటి వరకూ భూమిక నష్టపోయారు. అంతే కాకుండా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రానించిన విజయశాంతి సైతం సినిమాలను నిర్మించి నష్టపోయారు.
విజయశాంతి బాలయ్యతో నిప్పురవ్వ సినిమాను నిర్మించి దారుణంగా నష్టపోయారు. కృష్ణ కూతురు నటి మంజుల సినిమాల్లో నటించడంతో పాటూ సినిమాలను నిర్మించారు కూడా. మహేశ్ బాబుతో నాని సినిమా తీసి మంజుల చాలా నష్టపోయారు.
Also Read: 2022 సంవత్సరంలో బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటిన డబ్బింగ్ సినిమాలు