గత కొంత కాలం నుంచి చాలా మందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు పెరగడం.కేవలం సరైన ఆహారం, జీవనశైలి వల్ల మాత్రమే బరువు పెరుగరు. మందుల దుష్ప్రభావాలు, పలు ఆరోగ్య సమస్యల మూలంగా కూడా బరువు పెరిగే అవకాశముంది. బరువు తగ్గడానికి ప్రజలు తమ జీవనశైలిలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాటిని సరిగ్గా చేయడంలో విఫలమవుతున్నారు. దీంతో బరువు తగ్గడం కష్టంగా మారి ఊబకాయం సమస్య పెరుగుతోంది. వాకింగ్, వర్కవుట్, డైటింగ్ ఇలా రకరకాల పద్దతులను అనుసరిస్తే బరువు తగ్గుతారు. కొంత మంది బరువు తగ్గించుకోవడానికి పలు విధాల ప్రయత్నాలు చేస్తుంటారు. చాలా మంది సర్కాస్ ఫీట్లు చేస్తుంటారు. ఇడ్లీ సాంబార్ తింటే సులభంగా బరువు తగ్గవచ్చనే విషయం తక్కువ మందికి మాత్రమే తెలుసు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రధానంగా చాలా మంది బరువు తగ్గడానికి డైట్ ఫాలో అవుతారు. ఇష్టమైన ఆహార పదార్థాలన్నీ వదిలేసి పచ్చి కూరగాయలు, పండ్లు, మొలకలు తింటూ కాలయాపన చేస్తున్నారు. ఇష్టమైన చిరుతిళ్లు కళ్ల ముందు కనిపిస్తున్నా చేతితో ముట్టరు. ఇడ్లీ తింటే బరువు తగ్గడం ఎలాగంటే..? దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ బ్రేక్ ఫాస్ట్ ఇడ్లీ-సాంబార్, చట్నీతో పాటు తినండి. సాధారణంగా అన్ని హోటళ్లలో ఇడ్లీ సాంబార్ వంటివి అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా బరువు తగ్గడానికి కూడా ఇన్ ఫర్పెక్ట్ కాంబినేషన్ కూడా. దక్షిణ భారతదేశంలో సాధారణంగా ఇడ్లీలు ఎక్కువగా తింటుంటారు. కొబ్బరి చట్నీతో ఇడ్లీ రుచిగా ఉంటుంది. వాస్తవానికి ఇడ్లీలలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇడ్లీ తయారు చేయడానికి బియ్యం ఎక్కువగా అవసరం కానీ మీరు తక్కువ పిండి పదార్థాలు తీసుకోవాలనుకుంటే మీరు బియ్యం మొత్తాన్ని తగ్గించి దానికి బదులుగా మరో ప్రత్యామ్నాయాన్ని పెంచుకోవచ్చు. ఈ పిండిలో కూరగాయలు, ఆరోగ్యకరమైన మసాలా దినుసులు కూడా జోడించుకోవచ్చు.
Advertisement
Advertisement
Also Read : అమ్మాయిలు అలర్ట్.. ఈ 5 తప్పులు మాత్రం అస్సలు చేయొద్దు..!
బరువు తగ్గడానికి ఉపయోగపడే ఇడ్లీ :
మినపప్పు ఇడ్లీ, ఓట్స్ ఇడ్లీ కూడా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఓట్స్ ఇడ్లీ సాంప్రదాయ ఇడ్లీకి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నయం. ప్రధానంగా ఓట్స్ లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.అదేవిధంగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. మీరు అతిగా తినకుండా నిరోధిస్తుంది. పులిసిన పిండితో ఇడ్లీలను తయారు చేస్తుంటారు. పులియబెట్టిన ఆహారాన్ని తినడం వల్ల మన శరీరంలో విటమిన్లు, ఖనిజాలు విచ్ఛిన్నమవుతాయి.అదేవిధంగా జీర్ణక్రియ కూడా మెరుగుగా పని చేస్తుంది. పులియబెట్టిన ఆహారాల్లో ఉండే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా గట్ లోని pH బ్యాలెన్స్ ని మార్చుతుంది. ఇది మంచి ఆరోగ్యంతో ముడిపడి ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read : చలికాలంలో ఉదయం సమయంలో స్కిన్ కేర్ చిట్కాలు ఇలా ప్రయత్నించండి.. ఫలితం పక్కా..!