Home » చివరి రోజుల్లో సావిత్రి ఇల్లు, ఆస్తులను ఎందుకు అమ్మేయాల్సి వచ్చిందంటే..?

చివరి రోజుల్లో సావిత్రి ఇల్లు, ఆస్తులను ఎందుకు అమ్మేయాల్సి వచ్చిందంటే..?

by Anji
Ad

మహానటి సావిత్రి గురించి ఇప్పటి వారికి చాలా తక్కువ మందికే మాత్రమే తెలుసు. మన తాతల, తండ్రుల కాలంలో సావిత్రి ఎంత ఫేమస్ అడిగితే వారే చెబుతుంటారు. గుంటూరు జిల్లా చిర్రావూరులో కొమ్మారెడ్డి సావిత్రి డిసెంబర్ 06, 1935లో జన్మించారు. తల్లిదండ్రులు సుభద్రమ్మ, గురవయ్య. సావిత్రి పుట్టిన ఆరు నెలలకే  తండ్రి మరణించారు. దీంతో పెద్దమ్మ దుర్గాంబ, పెదనాన్న వెంకటరామయ్యల వద్ద విజయవాడలో పెరిగింది సావిత్రి. చిన్ననాటి నుంచి నాట్యం మీద, నటన మీద ఆసక్తి ఉండడంతో ఆమె ఎనిమిదవ తరగతి వరకు మాత్రమే చదువుకుంది. సావిత్రికి అప్పట్లోనే అంజలీదేవి అంటే చాలా అభిమానం. 1948లో వచ్చిన బాలరాజు సినిమాలో అంజలీదేవి తీయని వెన్నెలరేయి పాటకు చేసిన నాట్యం ఆమెకు ఎంతగా నచ్చిందంటే.. తాను ఇచ్చే నాట్య ప్రదర్శనలలో ఆ పాటను తప్పనిసరిగా అభినయించి అందరి మన్ననలను పొందింది. 

Advertisement

కళాభిమాని సుంకర కనకారావు ఆధ్వర్యంలో విజయవాడలో నడిచే అరుణోదయ నాట్యమండలి వారి సాంస్కృతిక ప్రదర్శనలలో సావిత్రి రెగ్యులర్ గా పాల్గొంటుండేది. అప్పట్లో ప్రముఖ నటుడు జగ్గయ్య తమ బృందంతో పాటు సావిత్రిని కూడా కాకినాడలో జరిగిన అఖిల భారత నృత్య నాటిక పోటీలకు తీసుకెళ్లారు. 1948లో జరిగిన ఆ పోటీలకు హిందీ నటులు పృధ్వీరాజ్ కపూర్ చీఫ్ గెస్ట్ గా హాజరై సావిత్రికి బహుమతి అందించారు.  పృధ్వీరాజ్ సావిత్రిని మెచ్చుకోవడం కళాకారిణిగా తన జీవితంలోనే ప్రధాన ఘట్టంగా భావించారు. నాటకాల్లో నటిస్తున్న వారు సినిమాల అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న ఆ రోజుల్లో సావిత్రిని సినిమాల్లో నటింపజేయాలని పెదనాన్న మద్రాస్ కి తీసుకెళ్లారు. అప్పట్లో జెమిని స్టూడియో వారు కొత్త వారిని ఎంపిక చేస్తూ పలు సినిమాలను తీస్తున్నారు. నటీనటులను ఎంపిక చేసే విషయంలో జెమిని గణేశన్ ముఖ్యడు. సావిత్రి జెమిని గణేశన్ ని తొలిసారిగా చూసింది కూడా అక్కడే. 

 

తొలుత అగ్నీ పరీక్ష సినిమా నిర్మాతలు ఆ చిత్రంలోని ఓ వ్యాంప్ పాత్రకు సావిత్రిని చూసి, ఆ పాత్ర పోషణకు ఆమె వయసు సరిపోదని పంపించారు. 1950లో సాధానా ఫిలింస్ వారి సంసారం చిత్రంలో నటించే అవకాశం సావిత్రికి లభించింది. ఎన్టీఆర్-అక్కినేని కలిసి నటించిన తొలిచిత్రం. ముఖ్యంగా దేవదాస్ చిత్రంతో ఆమె కెరీర్ పూర్తిగా మారిపోయింది. బతుకుదెరువు చిత్రంలో నటించి చిత్రసీమను తనవైపునకు మళ్లేవిధంగా చేసుకున్నారు. మనం పోలేమాంగల్యం అనే తమిల చిత్రంలో సావిత్రి కథానాయికగా నటించారు. హీరోగా జెమిని గణేశన్. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటికే అతనికి పెళ్లి అయిందని, పిల్లలు ఉన్నారని, రెండో భార్యగా నటి పుష్పవల్లి ఉందని తెలిసి కూడా అతనికి మూడో భార్యగా జీవితం సాగించడానికి సిద్ధపడ్డారు. 

Advertisement

Mahanati's deleted scene throws light on Rekha and father Gemini Ganesan's  relationship. Watch video - Hindustan Times

జెమిని గణేశన్ తో పెళ్లి జరిగిన నాలుగు సంవత్సరాల తరువాతనే ఆ విషయాన్ని బహిరంగ పరిచారు. 1958 డిసెంబర్ 2న ఆమెకు విజయ చాముండేశ్వరి పుట్టారు. 1965లో కుమారుడు సతీష్ కుమార్ పుట్టాడు. 1958 నాటికి ఆమె ఉచ్ఛదశలో ఉండడంతో మద్రాస్ లోని టీ నగర్ లో సొంత ఇల్లు, విశాలమైన భవంతిని కట్టుకున్నారు. ఆమెకు రేసు కోర్సులకు వెళ్లే అలవాటు ఉందనే వారు. ఖరీదు అయిన బంగారు ఆభరణాలను కొనుక్కోవడం ఆమెకు ఉన్న సరదాల్లో ఒకటి. ఒకవిధంగా అప్పట్లో ఆమె విలాసవంతమైన జీవితం గడిపేవారు. జెమిని గణేశన్ ఆమెకు సరదాగా మద్యం తీసుకునే అలవాటు చేశాడని అప్పట్లో సినీ ఇండస్ట్రీలో చెప్పుకునే వారు. వాస్తవానికి కొందరూ నటిమణులకు ఆ అలవాటు ఉన్నప్పటికీ అది కెరీర్ ని దెబ్బతీసేంత తీవ్ర ఉన్న దాఖలాలు లేవు. 1968లో అందరూ మహిళలే కలిసి ఒక సినిమా తీయాలని ప్లాన్ చేసినప్పుడు ఆ సినిమాని డైరెక్ట్ చేయాల్సిందిగా సావిత్రిని కోరారు. చివరికీ ఆ సినిమా బాధ్యత అంతా ఆమె నెత్తిమీదనే పడేసరికి తీవ్ర నష్టాలు తలెత్తాయి. ఆమె జీవితంలో తగిలిన తొలి ఎదురుదెబ్బ అదే కావడం విశేషం. ఆ చిత్రం మరేదో కాదండోయ్.. చిన్నారి పాపలు. ఇందులో సావిత్రితో పాటు షావుకారు జానకి, జమున, జగ్గయ్య తదితరులు నటించారు.  

Also Read :  స‌త్య‌దేవ్ భార్య ఎవ‌రో తెలుసా..? ఆమె గురించి ఎవ్వ‌రికీ తెలియ‌ని నిజాలు ఇవే.!

Manam News

1969లో సావిత్రి-జెమిని గణేశన్ విడిపోయారు. 1970లో సావిత్రి తల్లి మరణించారు. అది సావిత్రిని మానసికంగా మరింత కుంగదీసింది. 1971లో సావిత్రి మూగమనసులు అనే చిత్రాన్ని తమిళంలో ప్రాప్తం పేరుతో నిర్మించారు. అది ఫ్లాప్ కావడంతో డబ్బు విషయంలో మరింత నష్టపోయింది. ప్రధానంగా మద్యం తీసుకోకపోతే ఉండలేని పరిస్థితి. తీసుకుంటే డైలాగ్ లు చెప్పలేని పరిస్థితి. అందరూ ఆమెను చూసి జాలిపడడం ఆమెకు మరింత దారుణంగా అనిపించేది.  దీంతో ఇల్లు, కొన్ని ఆస్తులు కూడా అమ్మివేయాల్సి వచ్చింది. ఇలా దెబ్బ మీద దెబ్బ తగులుతుంటేఆమె విచారాన్ని మరిచిపోవడానికి మద్యానికి దాసురాలు కావడం, ఆహార నియమాలు ఏమి సరిగ్గా పాటించకపోవడంతో బాలా లావైపోయి ఆమెకు క్యారెక్టర్ రోల్స్ కూడా తగ్గిపోవడం జరుగుతూ వచ్చాయి. చివరి రోజుల్లో సావిత్రి దాదాపు 18 నెలల పాలు కోమాలోనే ఉంది. పరిస్థితి మరింత క్షీణించి డిసెంబర్ 26, 1981 మద్రాస్ లోని లేడీ వెల్లింగ్టన్ నర్సింగ్ హోమ్ లో 46 ఏళ్లకే సావిత్రి తిరిగిరాని లోకాలకు వెళ్లింది.  

Also Read :  సూప‌ర్ స్టార్ కృష్ణ‌ను ట్రెండ్ సెట్ట‌ర్ అని ఎందుకంటారు..? 10 కార‌ణాలు ఇవే..!

Visitors Are Also Reading