Satyadev wife: టాలీవుడ్ లోని టాలెంటెడ్ హీరోలలో సత్యదేవ్ కూడా ఒకరు. మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సత్యదేవ్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్నాడు. కేవలం హీరో పాత్రలే కాకుండా విలన్ పాత్రలలోనూ సత్యదేవ్ అదరగొడుతున్నాడు.
Advertisement
నటుడిగా మంచి గుర్తింపు రావడంతో సత్యదేవ్ ఫుల్ బిజీగా మారిపోయాడు. రీసెంట్ గా చిరంజీవి హీరోగా నటించిన గాఢ్ ఫాదర్ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించాడు.
Also Read: మసూద సినిమాలో దెయ్యం పాత్రలో నటించిన నటి ఎవరో తెలుసా..? ఆమె బ్యాగ్రౌండ్ ఇదే..!
Advertisement
ఇక సత్యదేవ్ హీరోగా నటించిన మరో సినిమా గుర్తుందా సీతాకాలం సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాకు నాగశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉంటే సత్యదేవ్ సినిమాల గురించి చాలా మందికి తెలుసు కానీ ఆయన పర్సనల్ లైఫ్ గురించి ఎవ్వరికీ తెలియదు. సత్యదేవ్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేశాడు. సినిమాల పై ఉన్న ఆసక్తితో ఉద్యోగం చేస్తూనే షార్ట్ ఫిల్మ్స్ లో నటించడం మొదలుపెట్టాడు.
అలా తన నటనతో మెప్పించి సినిమా అవకాశాలను అందుకున్నాడు. అంతే కాకుండా సత్యదేవ్ కు ఇంకా పెళ్లికాలేదని అనుకుంటారు. కానీ ఇప్పటికే సత్యదేవ్ కు పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయం గుర్తుందా సీతాకాలం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో బయటపడింది. హీరోయిన్ తమన్నా సత్యదేవ్ భార్యను పిలిచి పరిచయం చేశారు. కాగా దీపిక ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సత్యదేవ్ భార్య పేరు దీపిక కాగా ఆమె తన పిల్లల బాధ్యతలు చూసుకుంటోంది. దీపిక ఇంటివద్దనే పిల్లలతో పాటూ సత్యదేవ్ కు సంబంధించిన అన్ని విషయాలను దగ్గరుండి చూసుకుంటున్నారు.
Advertisement
Also Read: అజిత్ తునివుకు తెలుగు టైటిల్ ఇదే.. థియేట్రికల్ బిజినెస్ ఎంతంటే ?