Home » తిరిగి పంపిన క‌థ‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన ఈవీవీ…జంబ‌ల‌కడిపంబ‌కు తెర‌వెన‌క ఇంత క‌థ జరిగిందా..?

తిరిగి పంపిన క‌థ‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన ఈవీవీ…జంబ‌ల‌కడిపంబ‌కు తెర‌వెన‌క ఇంత క‌థ జరిగిందా..?

by AJAY
Published: Last Updated on
Ad

టాలీవుడ్ లోని లెజండ‌రీ డైరెక్ట‌ర్స్ లో ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ ఒక‌రు. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌ను ప్రేక్షకులు ఎప్పుడూ మ‌ర్చిపోలేరు. ఆయ‌న పండించిన కామెడీకి ఎవ్వ‌రూ న‌వ్వ‌కుండా ఉండ‌లేరు. అలాంటి ఈవీవీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌లో జంబ‌ల‌క‌డి పంబ సినిమా కూడా ఒక‌టి. ఈ సినిమాలో వీకే న‌రేష్ ఆమ‌ని ప్ర‌దాన పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాలో కామెడీ నెవ్వ‌ర్ బిఫోర్ ఎవ్వ‌ర్ ఆఫ్ట‌ర్ అనేవిధంగా ఉంటుంది.

Also Read:  టాలీవుడ్ లో అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ కలిగిన హీరో ఎవరు ? టాప్ లో ఉన్నది ఏ హీరో అంటే ?

Advertisement

ఈవివి సినిమాల్లో ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా నవ్వించిన సినిమాల‌లో ఈ సినిమా కూడా ఒక‌టి. ఈవీవీ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ఉన్న‌ప్పుడు జంబ‌ల‌క‌డిపంబ సినిమా క‌థ‌ను రాసుకున్నారట‌. అంతే కాకుండా ఆయ‌న ఈ క‌థ‌ను ఆంద్ర‌జ్యోతి ప‌త్రిక‌కు పంపించార‌ట‌. కానీ ఇది కూడా ఒక క‌థేనా అంటూ ఆంద్ర‌జ్యోతి ప‌త్రిక జంబ‌ల‌క‌డి పంబ క‌థ‌ను రిజెక్ట్ చేసింది. కానీ ఈవీవీ మైండ్ లో మాత్రం తాను రాసిన జంబ‌ల‌క‌డి పంబ క‌థ‌పై న‌మ్మకం పోలేద‌ట‌.

Advertisement

ఎప్ప‌టికైనా ఆ క‌థ‌ను తెర‌పై చూపించాల‌ని అనుకున్నార‌ట‌. ఇక ద‌ర్శ‌కుడిగా స‌క్సెస్ అయిన త‌ర‌వాత ఇవివి ఈ క‌థ‌ను రాజేంద్ర‌ప్ర‌సాద్ హీరోగా పెట్టి చేయాల‌ని అనుకున్నార‌ట‌. కానీ స్టార్ గా రానిస్తున్న రాజేంద్ర‌ప్ర‌సాద్ బిజీ షెడ్యూల్ వ‌ల్ల ఈ క‌థ‌ను ప‌క్క‌న పెట్టారు. దాంతో న‌రేష్ ను హీరోగా ఎంచుకుని ఈవీవీ ఈ సినిమాను ప్రారంభించారు.

Also Read:  Waltair Veerayya : ఆ సెంటిమెంట్ మెగా అభిమానులకు భయం తెప్పిస్తోందా ?

ఇక మొద‌ట హీరోయిన్ గా చాలా మందిని అనుకున్నా కుద‌ర‌క‌పోవ‌డంతో చివ‌రికి ఆమ‌నిని హీరోయిన్ గా ఎంపిక చేశారు. సినిమాలో బ్ర‌హ్మానందం, ఆలీ, బాబుమోహ‌న్ లాంటి టాప్ క‌మెడియ‌న్ లు అంద‌రినీ తీసుకున్నారు. కేవ‌లం యాబై ల‌క్ష‌ల బ‌డ్జెట్ తో ఈ సినిమాను తెర‌కెక్కించారు. కాగా ఈ సినిమా థియేట‌ర్ ల‌లో వంద‌రోజులు విజ‌యవంతంగా ఆడ‌టమే కాకుండా రెండు కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది.

Also Read:   రాజమౌళి to ప్రశాంత్ నీల్ దేశమంతటా క్రేజ్ ఉన్న డైరెక్టర్స్ వీళ్ళే..!!

Visitors Are Also Reading