తెలుగులో వచ్చిన డాన్స్ షోలలో ఢీ తర్వాత మళ్లీ ఆట షోకు అంతటి క్రేజ్ ఉంది. జీ తెలుగులో ప్రసారమైన ఈ రియాల్టీ షోకు ఓంకార్ యాంకర్ గా వ్యవహరించారు. అప్పట్లో ఈ డాన్స్ షోకు చాలామంది అభిమానులు ఉండేవారు. చాలామంది కొరియోగ్రాఫర్లు ఈ షో ద్వారా పరిచయమయ్యారు. ఇక ఇదే షోలో శ్రీవిద్య అనే డాన్సర్ కూడా ఎంతో పాపులారిటి సంపాదించుకుంది.
ఆ తర్వాత శ్రీవిద్య ఆట విన్నర్ నిలిచి జడ్జిగా సైతం వ్యవహరించింది. చూడటానికి బొద్దుగా ఉన్నప్పటికీ అందం మరియు డాన్స్ తో శ్రీవిద్య ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత చిరంజీవి హీరోగా నటించిన జై చిరంజీవ సినిమాలో శ్రీవిద్య నటించే అవకాశం దక్కించుకుంది. ఇదిలా ఉంటే శ్రీవిద్య ప్రముఖ రచయిత నా పేరు సూర్య సినిమా డైరెక్టర్ వక్కంతం వంశీని పెళ్లి చేసుకుంది.
Advertisement
Advertisement
కాగా రీసెంట్ గా తన భర్తతో కలిసి శ్రీవిద్య ఆలీతో జాలీగా టాక్ షోకు హాజరైంది. అయితే ఒకప్పుడు బొద్దుగా కనిపించిన శ్రీవిద్య ఇప్పుడు చాలా నీరసంగా సన్నగా కనిపిస్తోంది. అంతే కాకుండా తన జీవితంలో జరిగిన విషాద సంఘటన గురించి ఈ కార్యక్రమంలో షేర్ చేసుకుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీవిద్య ఎందుకని కొద్ది రోజులుగా దూరంగా ఉంటుందని ఆలి శ్రీవిద్యను ప్రశ్నించారు. ఎవరైనా బాధపెట్టారా అని అడిగారు… దానికి సమాధానం ఇస్తూ బాధ అనేదాని కంటే పెద్ద పదం ఉంటే అదే అవ్వాలి అంటూ ఎమోషనల్ అయింది.
మాకు ఒక బాబు పాప ఉన్నారు, పాప కంటే ముందు ఓ బాబు పుట్టి చనిపోయాడు. ఆ డిప్రెషన్ నుండి బయటకు రావడానికి రెండు నెలలు పట్టింది. ప్రతి ఏడాది ఆ బాబుని గుర్తు చేసుకుని బాధపడుతుంటాను. లాక్డౌన్ సమయంలో ప్రెగ్నెన్సీ వచ్చింది…. అప్పుడు పాప పుట్టి నాలుగు నిమిషాలకే నా ముందే కన్నుమూసింది.” అంటూ శ్రీవిద్య చెప్పుకొచ్చింది. ఇక ఆమె బాధ విన్న తర్వాత ఆలీ సైతం కన్నీటి పర్యంతమయ్యారు.