Home » నాగార్జునతో నటించడానికి శ్రీదేవి అప్పట్లో భయపడిందా ?

నాగార్జునతో నటించడానికి శ్రీదేవి అప్పట్లో భయపడిందా ?

by Anji

అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తనను అందరూ దేవకన్య  అని పిలిచేవారు. సినీ ఇండస్ట్రీలో శ్రీదేవి లాంటి హీరోయిన్ ఇప్పటివరకు రాలేదు. మున్ముందు కూడా వచ్చే ఛాన్స్ లేదు. శ్రీదేవికి ఉన్న అందం అలాంటి మరి. తనతో సినిమాల్లో నటించాలని కోరుకని హీరో లేడు. అందరూ హీరోల డేట్స్ కోసం క్యూ కడితే.. అప్పట్లో శ్రీదేవి డేట్స్ కోసం క్యూ కట్టేవారు. తనకు ఉన్న క్రేజ్ అలాంటి మరి. సీనియర్ ఎన్టీఆర్ కి మనవరాలిగా కూడా నటించింది శ్రీదేవి. ఆ తరువాత ఆయన సరసన హీరోయిన్ గా కూడా నటించింది. 

అదేవిధంగా ఏఎన్నార్ పక్కన కూడా హీరోయిన్ గా నటించింది. ఆయన కొడుకు అక్కినేని నాగార్జున సరసన కూడా హీరోయిన్ గా నటించింది. ఆఖరిపోరాటం సినిమాలో శ్రీదేవిని హీరోయిన్ గా తీసుకోవాలని దర్శకుడు రాఘవేంద్రరావు అనుకున్నారట. అయితే నాగార్జునకు జోడిగా అనగానే శ్రీదేవి ఒప్పుకోలేదట. అసలే కుర్ర హీరో.. అతని పక్కన నటిస్తే రొమానస్ చేస్తే జనాలు ఏమనుకుంటారు. అందులోనూ తన తండ్రితోనూ హీరోయిన్ గా నటించాను కదా.. వర్కవుట్ అవుతుందా? నాకు ఎలాంటి సమస్య లేదు కానీ అందట..!

Also Read :   హీరో నాగశౌర్య పెళ్లికి ఎంత కట్నం తీసుకున్నాడో తెలుసా ?

Manam News

అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే సందేహం వ్యక్తం చేసిందట శ్రీదేవి. దర్శకుడు రాఘవేంద్ర రావు మాత్రం ఆ విషయాన్ని మాత్రం నాకు వదిలేయ్.. మీ జంటను మోస్ట్ రొమాంటిక్ జంటగా తీర్చిదిద్దుతాను అని చెప్పాడట. జనాలకు కనెక్ట్ అయ్యేలా చేస్తానని శ్రీదేవికి మాట కూడా ఇచ్చాడట. అలా వీరిద్దరూ కలిసి ఆఖరి పోరాటం సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు. ఆ తరువాత ఆ సినిమా సూపర్ హిట్ సాధించడంతో ఆ జంటకు కూడా మంచి పేరు వచ్చింది. ఇక అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. 

Also Read :  20 ఏళ్ల వయసులోనే డేటింగ్.. చివరికి మోసపోయిన హీరోయిన్..!

Visitors Are Also Reading