టాలీవుడ్ లో చాలా మంది హీరోలు పెళ్లి చేసుకుని సెటిల్ అవుతున్నారు. మరికొందరూ మాత్రం పెళ్లి చేసుకోకుండా బ్యాచ్ లర్ గానే ఉంటున్నారు. వారికి ఉదాహరణ రెబల్ స్టార్ ప్రభాస్ అనే చెప్పాలి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా ఉన్న నాగశౌర్య తాజాగా పెళ్లి చేసుకొని కొత్త బంధంలోకి అడుగు పెట్టారు. దీంతో నాగశౌర్య అభిమానులు ఫుల్ సంబరపడుతున్నారు.
Advertisement
ప్రస్తుతం హీరోగా నాగశౌర్య మంచి ఫామ్ లో ఉన్నాడు. వరుస సినిమాలు చేస్తూ.. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సొంత నిర్మాణంలో కూడా చేస్తూ టాలీవుడ్ పై దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. ఎన్ని సినిమాలు చేసినా నాగశౌర్య ఇప్పటివరకు ఒక్క కాంట్రవర్సికి కూడా తావు ఇవ్వలేదు. తన పరిధిలో తాను సినిమాలు చేసుకుంటూనే వెళ్తున్నాడు. నటనలో కూడా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకుంటూ.. మంచి వేరియేయన్స్ కూడా చూపిస్తూ దూసుకెళ్తున్నాడు. ఇటీవలే కృష్ణ వింద విహారి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు నాగశౌర్య. ఇదిలా ఉండగా.. నాగశౌర్య వయసు 33 సంవత్సరాలు. చాలా రోజుల నుంచి ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా కాసేపు వాటికి విరామం ఇచ్చి తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. బెంగళూరులో నివసించే అనూషశెట్టి ఇంటీరియర్ డిజైనర్.
Advertisement
Also Read : 20 ఏళ్ల వయసులోనే డేటింగ్.. చివరికి మోసపోయిన హీరోయిన్..!
అసలు అనూష శెట్టి హీరో నాగశౌర్యకి ఎలా పరిచయమైంది అని చాలా మంది అనుకుంటున్నారు. వీరు కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమయ్యారు. కొన్నాళ్ల పాటు బాగానే స్నేహితులుగా కొనసాగారు. ఆ తరువాత వీరి మధ్య స్నేహం ప్రేమగా మారి అది పెళ్లి వరకు వెళ్లింది. బెంగళూరులోని ఓ లగ్జరీ హోటల్ లో వీరి పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది. వీరి పెళ్లి వార్త తెలిసినప్పటి నుంచి నాగశౌర్య కట్నం ఎంత తీసుకుంటున్నాడు అంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. కోట్లకు అధిపతి అయినటువంటి అనుష్క ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ చాలా పెద్దదనే చెప్పాలి. హీరో నాగశౌర్యకి కట్నం కింద కొన్ని ప్రాపర్టీస్ తో పాటు రూ.50కోట్ల వరకు డబ్బు కూడా అప్పగించారట అనూష శెట్టి తల్లిదండ్రులు. ఇక నాగశౌర్య మంచి కోటీశ్వరుడని చెప్పకనే చెప్పవచ్చు.
Also Read : చిరంజీవిపై ప్రధాని ప్రశంసలు.. భావోద్వేగ ట్వీట్ చేసిన మెగాస్టార్..!