Home » ఈ జ్యూస్ తాగితే పోషకాలతో పాటు ఎన్నో సమస్యలకు చెక్..!

ఈ జ్యూస్ తాగితే పోషకాలతో పాటు ఎన్నో సమస్యలకు చెక్..!

by Anji
Ad

చాలా మందికీ చలికాలంలో ఎన్నో వ్యాధులు చుట్టూముడుతుంటాయి. ఈ సీజన్ లో జలుబులు, దగ్గులు, జ్వరాలు లాంటివి వస్తుంటాయి. అయితే ఈ సీజన్ లో మనకి బాగా దొరికే ఉసిరి ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఉసిరినీ ఏవిధంగా తీసుకున్న దానిలోను పోషకాలు శరీరానికి బాగా అందుతాయి. ఇక జ్యూస్ చేసుకుని తాగినా, ఒరుగులు చేసుకున్న మురబ్బా, రోటి పచ్చడి, ఊరగాయ ఇలా ఏ విధంగా తీసుకున్నా మంచి ఉపయోగాలు కలుగుతాయి. సి విటమిన్ పుష్కలంగా ఉండే ఈ ఉసిరిని సూపర్ ఫుడ్ అని అంటారు. ఉసిరి ఆయుర్వేదంలో ఎంతో బాగా ఉంటుంది. 

Advertisement

 

ఉసిరిని డైట్ లో చేర్చుకుని తీసుకోవడం వల్ల దానిలోని పోషకాలు రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ఉసిరిలో యాంటీ ఇంప్లిమెంటరీ లక్షణాలు యాంటీ గ్లైసమిక్ లక్షణాలు పుస్కలంగా ఉంటాయి. అదేవిదంగా దీనిలో మినరల్స్, ఫైబర్, ప్రోటీన్స్ అద్బుతంగా ఉంటాయి. ఉసిరిలో ఉండే విటమిన్ సి, కాల్సియం, ఐరన్ బీ కాంప్లెక్స్ పాస్పరస్ తో పాటు ఇతర విటమిన్లు, మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఉసిరినీ ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి. మధుమేహం వ్యాదిగ్రస్తుల్ని అదుపులో ఉంచేందుకు ఉసిరి గొప్ప ఔషదంగా పని చేస్తుంది. క్రోమియం మధుమేహం, కంట్రోల్ లో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ ని కరిగించి రక్త ప్రసరణ  సక్రమంగా జరిగేవిదంగా చూస్తుంది. అధిక బరువుతో ఇబ్బంది పడే వారికి ఉసిరి చక్కని ఉపశమనం కలిగిస్తుంది. 

Advertisement

Also Read :  ఇలా చేస్తే చలిలో కూడా మీ స్కిన్ మెరిసిపోవడం పక్కా..!

manam  News

ఇందులో ఉండే ఫైబర్ త్వరగా ఆకలి వేయడానికి తగ్గిస్తుంది. దీంతో ఎక్కువ ఆహారం తీసుకోకుండా కంట్రోల్ లో ఉంచుతుంది. జీర్ణ సమస్యలు లేకుండా తీసుకున్న ఆహారం చక్కగా జీర్ణమవ్వడానికి బాగా సహాయపడుతుంది. అదేవిదంగా బెల్లీ ఫ్యాట్ కూడా కరిగిపోతుంది. ఉసిరినీ ఏవిధంగా అయినా తీసుకోవచ్చు. చాలా మంది ఉసిరి కాయని పచ్చిగా కూడా తీసుకుంటుంటారు. మరికొందరూ ఉసిరినీ ఎండబెట్టి పొడి చేసుకుని వాడుతుంటారు. ఎన్నో పోషకాలు, కణజాలు కలిగి ఉన్న ఉసిరి జ్యూస్ తయారు చేసుకోవడానికి రెండు కాయలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీ జార్ లో వేసి నీళ్లు పోసి జ్యూస్ మాదిరిగా చేసుకుని దానిని వడకట్టుకొని కాస్త తేనె కలుపుకొని నిత్యం గ్లాస్ తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. 

Also Read :  అరటి ఆకులో తింటే కలిగే లాభాలు తెలిస్తే అస్సలు వదలరు..!

 

Visitors Are Also Reading