ఎన్టీఆర్ ఏఎన్నార్ తోపాటు వారి తరంలో సూపర్ స్టార్ కృష్ణ కూడా స్టార్ హీరోగా రాణించారు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో కృష్ణ సూపర్ స్టార్ గా ఎదిగారు. అంతేకాకుండా తెలుగు తెరకు కొత్తదనాన్ని పరిచయం చేసిన హీరో కూడా సూపర్ స్టార్ అనే చెప్పాలి. కౌబాయ్ సినిమాలతో పాటు డేరింగ్ అండ్ డాషింగ్ పాత్రలు చేసి కృష్ణ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అప్పట్లో తనకంటే ముందే ఇండస్ట్రీలోకి వచ్చిన ఎన్టీఆర్ ఏఎన్నార్ లకు సైతం కృష్ణ పోటీ ఇచ్చారు.
Also Read: ఆ అర్థరాత్రి జమున గది తలుపు తట్టిన ఎస్వి రంగారావు.. ఏం చెప్పారో తెలుసా..?
Advertisement
ఏడాదికి పదుల సంఖ్యలో సినిమాలు చేసి కృష్ణ అప్పట్లో ఫుల్ బిజీ నటుడిగా పేరు సంపాదించుకున్నారు. ఇది ఇలా ఉంటే కృష్ణకు అప్పట్లో ఎన్టీఆర్ తో విభేదాలు వచ్చాయనే సంగతి తెలిసిందే. అల్లూరి సీతారామరాజు సినిమాతో పాటూ రాజకీయాల పరంగా ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఎన్టీఆర్ సీఎంగా ఎన్నికైన సమయంలో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజీవ్ గాంధీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరిన కృష్ణ ఎన్టీఆర్ పై విమర్శలు కురిపించారు.
Advertisement
దాంతో కృష్ణ సినిమా పోస్టర్లను ఎన్టీఆర్ అభిమానులు చింపేసిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఏఎన్ఆర్ తో కూడా ఒకానొక సమయంలో కృష్ణకు విభేదాలు వచ్చాయన్న సంగతి చాలా మందికి తెలియదు. సూపర్ స్టార్ కృష్ణ మరియు ఏఎన్నార్ తెలుగు సినిమాకు రెండు కళ్ల లాంటివారు.
ఇద్దరూ స్టూడియోలు నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు. అయితే కృష్ణ ఏఎన్ఆర్ మధ్య వచ్చిన విభేదాలతో ఇద్దరు కలిసి మల్టీ స్టారర్ సినిమాలు కూడా చేయకూడదు అని నిర్ణయానికి వచ్చారట. ఆ తరవాత కొంతకాలానికి మళ్లీ కలుసుకున్నారు. ఇక ప్రస్తుతం ఈ లెజెండ్స్ మన మధ్యమ లేకపోయినా వారి సినిమాల ద్వారా ఎప్పుడూ బ్రతికే ఉంటారు.
Also Read: కృష ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా చిరంజీవి కొనసాగాడనే విషయం మీకు తెలుసా ?