Telugu News » Blog » ఆ అర్థరాత్రి జమున గది తలుపు తట్టిన ఎస్వి రంగారావు.. ఏం చెప్పారో తెలుసా..?

ఆ అర్థరాత్రి జమున గది తలుపు తట్టిన ఎస్వి రంగారావు.. ఏం చెప్పారో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ads

తెలుగు ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్లలో జమున కూడా మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్. అలాంటి జమున ఒక హీరోతో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ చివరికి పెళ్లి క్యాన్సిల్ అయింది. దీనికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓవైపు గుండమ్మ కథ షూటింగ్ జరుగుతున్న సమయం. ఈ చిత్రంలో ఎన్టీఆర్,అక్కినేని జమున,సావిత్రి, ఎస్ వి రంగారావు,సూర్యకాంతమ్మ మరికొంతమంది పేరుగాంచిన నటులు నటిస్తున్నారు. ఇక ఎస్వీఆర్ కి ఉన్న మద్యం అలవాటు అందరికీ తెలుసు.

Advertisement

ALSO READ;కృష్ణకు పద్మభూషణ్ రావడం వెనక అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి పాత్ర ఏంటంటే..?

ఓ రోజు బాగా తాగి ఎస్వీ రంగారావు జమున ఉంటున్న గది తలుపు తట్టారట. ఆరోజు జరిగిన సంఘటనని ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేశారు జమున. తెల్లవారి జామున ఆమెను కూర్చోబెట్టి జీవితం గురించి అనేక విషయాలను, అలాగే జీవితం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తల గురించి జమునకు చెబుతూ వస్తున్నారట ఎస్వీ రంగారావు. జీవితంలో ఎలా ఎదగాలి, ఎవరితో ఎలా ఉండాలి అనే విషయాలపై జమునకు సూచనలు చేశారట. ఇదంతా చెబుతున్న కొద్ది జమునకు చిరాకు పెరిగిపోతుందట. అప్పటికే ఉదయం 5:00 అవుతుంది. కానీ ఆయన గది వదిలి వెళ్లటం లేదు.

Advertisement

ఇక కాసేపటికి మెల్లగా లేచి వెళ్ళిపోతూ, ఓ పిల్ల ఓ కుర్ర వెధవతో నీ యవ్వారం గురించి అందరూ చెప్పుకుంటున్నారు. నేను కూడా విన్నాను. అతడు అందరూ ఎన్టీఆర్ అవుతారని చెప్పుకుంటున్నారు. కానీ ఆ వ్యక్తి మరో తాగుబోతు ఎస్విఆర్ అవుతాడు. జాగ్రత్త సుమా అని చెప్పి వెళ్లిపోయారట. అప్పుడు జమునకు జ్ఞానోదయం అయింది. ఆ హీరో ఎవరో బయటకు చెప్పకపోయినా అతడికి ఉన్న మద్యం అలవాటు గురించి తెలిసింది. దీంతో అతనితో పెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకుంది. అతడు ఎవరో కాదు హీరో హరినాథ్. ఎస్వీ రంగారావు చెప్పినట్లే ఆ తర్వాత కాలంలో ఆయన మత్తుకు బానిసై ఇండస్ట్రీకి దూరమై ఈ లోకం నుండి శాశ్వతంగా వెళ్లిపోయారు.

Advertisement

ALSO READ;నాతో క‌లిసి న‌టించ‌డానికి భ‌య‌ప‌డుతున్నారు..ప్ర‌కాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్..!