శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఉసిరి చాలా బెటర్. అయితే ఉసిరి రసం తీసుకోవడం వల్ల ఇది మన శరీరాన్ని ఏఏ మార్గాల్లో మెరుగుపరుస్తుంది అనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఉసిరికి శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక గ్లాసు ఉసిరి రసంలో ఒక గ్లాసు నిమ్మరసం కంటే చాలా ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. ఇది చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. విటమిన్ సి సూర్యుని అతినీలలోహిత కిరణాల నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. స్కిన్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఉసిరి జ్యూస్ కలయిక చాలా ముఖ్యం. ఉసిరి రసం వల్ల చర్మానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
Advertisement
Advertisement
చాలామంది చర్మంపై చికాకుతో బాధపడుతున్నారు. ఉసిరి రసం ఈ సమస్యను నివారిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉసిరి రసం జుట్టుతో పాటు, చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జుట్టు యొక్క మూలాలకు పోషణను అందిస్తుంది. ఉసిరికాయ రసాన్ని రోజు తీసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా నల్లగా, పొడవుగా మారుతుంది. అలాగే జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఉసిరి పేస్ట్ ను హెయిర్ ప్యాక్ లా ఉపయోగించాలి. గుండె జబ్బులు రాకుండా ఉసిరి రసం ఎంతో మేలు చేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉసిరి రసాన్ని రోజు తీసుకోవడం వల్ల అందులోని యాంటీ ఆక్సిడెంట్ల వల్ల గుండెపోటు, స్ట్రోక్ మొదలైన వాటిని నివారిస్తుంది.
Also Read : ఉదయం టీకి బదులు సొరకాయ జ్యూస్ తాగండి.. లాభాలెన్నో..!
ఇప్పటికే శరీరంలో మధుమెహ వ్యాధి ఉన్నవారికి ఈ రసం చాలా మేలు చేస్తుంది. ఉసిరి రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. పీరియడ్స్ సమయంలో చాలామందికి పొత్తికడుపు నొప్పి వస్తుంది. అలాంటి సమయంలో క్రమం తప్పకుండా ఉసిరి జ్యూస్ తీసుకోవడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు.
Also Read : రోజుకు ఎన్ని బాదం గింజలు తినాలో మీకు తెలుసా ?