Home » కరోనా తర్వాత మరో ముప్పు…బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏం చెప్పారు…?

కరోనా తర్వాత మరో ముప్పు…బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏం చెప్పారు…?

by AJAY
Ad

చరిత్రలో చాలామంది స్వామీజీలు, మునులు, ఋషులు కాలజ్ఞానం చెప్పారు. కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానంకు ఒక ప్రత్యేకత ఉంది. బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు ఇప్పటి వరకు జరుగుతూ వచ్చాయి.

Advertisement

మూడు కాళ్ళ లేగదూడ జన్మించడం… అదేవిధంగా వేప చెట్టుకు పాలు కారడం, ఎంపలి చెట్టుకు నిచ్చెన వేసే అంత మనిషి పుట్టడం ఇలా ఎన్నో విషయాలు జరుగుతూనే వచ్చాయి. అంతేకాకుండా ప్రస్తుతం పంజా విసురుతున్న కరోనా మహమ్మారి గురించి కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానం లో ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

Also Read: RAPO -19 : రామ్ ను ఢీ కొట్టే విలన్ గా ఆది పినిశెట్టి…లుక్ అదుర్స్..!

Advertisement

brahmam gari kalagnanam

brahmam gari kalagnanam

బ్రహ్మం గారు కాలజ్ఞానం లో “కోరంకియగు ఒక జబ్బు వచ్చేనయా కోట్ల మందికి తగిలి కోడి లాగా తూగి సచ్చేరయా” అంటూ పేర్కొన్నారు. అయితే అది కరోనానేనని చాలా మంది భావిస్తున్నారు. ఇక ఇప్పటికీ కరోనా ప్రభావం ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మరోవైపు వచ్చే ఏడాది కూడా బ్రహ్మంగారు చెప్పిన విధంగా మహమ్మారి ముప్పు పొంచి ఉన్నట్టు కనిపిస్తోంది. కోరంకితో పాటు మరో కొత్తరకం వైరస్ తో కూడా పోరాడాలని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పుకొచ్చారు.

 

అయితే ఇటీవల బ్రిటన్ లో కొత్త స్ట్రెయిన్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రస్తుతం ఈ స్ట్రెయిన్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. కొన్ని దేశాల్లో లాక్ డౌన్ సైతం విధిస్తున్నారు. భారత్ లో కూడా ఈ స్ట్రెయిన్ కు సంబంధించిన కేసులు ఇప్పటికే నమోదయ్యాయి. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దాంతో రాబోయే కాలంలో బ్రహ్మంగారు చెప్పిన విధంగా ఇంకా ఎన్ని ప్రళయాలు చూడాల్సి వస్తుందో అన్న ఆందోళన పజల్లో మొదలయ్యింది.

Also Read: ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్…నెట్ ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఛార్జీలు భారీగా తగ్గింపు…!

Visitors Are Also Reading