Home » RAPO -19 : రామ్ ను ఢీ కొట్టే విలన్ గా ఆది పినిశెట్టి…లుక్ అదుర్స్..!

RAPO -19 : రామ్ ను ఢీ కొట్టే విలన్ గా ఆది పినిశెట్టి…లుక్ అదుర్స్..!

by AJAY
Ad

ఇస్మార్ట్ శంకర్ లాంటి సూపర్ హిట్ తర్వాత రామ్ పోతినేని రెడ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ సినిమా అనుకున్న మేర విజయం సాధించలేకపోయింది. ఈ సినిమా తరవాత రామ్ తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వర్కింగ్ టైటిల్ రాపో 19 గా ఖరారు చేశారు. ఈ చిత్రానికి “ఉస్తాద్” అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

Advertisement

Aadhi pinishetty

Aadhi pinishetty

ఈ చిత్రం మాస్ మసాలా సినిమాగా ఉండబోతునట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో లో రామ్ ను ఢీ కొట్టే విలన్ గా ఆది పినిశెట్టి నటిస్తున్నారు. ఆది పినిశెట్టి హీరోగా చేస్తూనే విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆది అల్లు అర్జున్ హీరోగా నటించిన సరైనోడు సినిమా లో విలన్ గా నటించి ఆకట్టుకున్నాడు.

Advertisement

ఈ చిత్రం తర్వాత మళ్లీ ఆది విలన్ గా కనిపించలేదు. కానీ ఇప్పుడు రామ్ సినిమాలో మళ్లీ విలన్ గా నటిస్తున్నాడు. నేడు ఆది పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేస్తూ ఆయన పోస్టర్ ను విడుదల చేసింది. పోస్టర్ చూస్తుంటే ఆది ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నట్టు కనిపిస్తోంది. మరి ఈ సినిమా ఆదికి విలన్ గా ఎలాంటి విజయాన్ని ఇస్తుందో చూడాలి.

Visitors Are Also Reading