రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాధేశ్యామ్ సినిమా తరువాత ప్రభాస్ ఆదిపురుష్, సలార్ చిత్రాలలో నటిస్తున్నాడు. ముఖ్యంగా యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న సలార్ చిత్రాన్ని కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. దాదాపు రూ. 270 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. సలార్ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నారు. ముందుగా ఈ ఏడాది ఏప్రిల్ 14నే విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. దీని ఫలితంగా విడుదల తేదీ కూడా వాయిదా పడింది.
Advertisement
ఇప్పటికే ఈ సినిమా కొంత భాగం షూటింగ్ జరుపుకుంది. షూటింగ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యేక్షమయ్యాయి. తాజాగా మరి కొన్ని ఫోటోలు కూడా నెట్టింట్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా షూటింగ్ స్పాట్ లో ప్రభాస్ ఉన్న ఫోటోలు లీక్ కావడంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ చాలా సీరియస్ అయినట్టు తెలుస్తోంది.
Advertisement
Also Read : పొన్నియన్ సెల్వన్ నటీనటుల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
షూటింగ్ స్పాట్ లో ఫోటోలు లీక్ అవుతున్న విషయాన్ని తెలుసుకున్న ప్రశాంత్ నీల్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతుంది. ఇక నుంచి నటీ, నటులు, టెక్నికల్ టీమ్ సభ్యులు గానీ షూటింగ్ సెట్ లోకి మొబైల్ ఫోన్స్ తీసుకురావద్దని ఆర్డర్ వేశాడట. కార్ వ్యాన్ లో కానీ, లాకర్స్ లో కానీ మొబైల్స్ ఉంచాలని సూచింనట్టు సమాచారం. షూటింగ్ సెట్ లో మొబైల్ ను పూర్తిగా నిషేధించారని తెలుస్తోంది. కాగా గతంలో ఆర్ఆర్ఆర్ షూటింగ్ సమయంలో కూడా ఫోటోలు లీక్ అవుతున్నాయని దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకోవడం విశేషం. మొత్తానికి ప్రశాంత్ నీల్ రాజమౌళిని ఫాలో అవుతున్నాడనే చెప్పవచ్చు.
Also Read : మంత్రి రోజాకి అవమానం జరిగిందా..? స్టేజీపై ఆమె కన్నీరు ఎందుకు పెట్టింది..!