Home » రాజ‌మౌళి- మ‌హేష్ సినిమాలో హాలీవుడ్ స్టార్ న‌టుడు..!

రాజ‌మౌళి- మ‌హేష్ సినిమాలో హాలీవుడ్ స్టార్ న‌టుడు..!

by Anji
Ad

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి, టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌బోయే సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్‌డేట్ బ‌య‌టికి వ‌చ్చింది. ఈ సినిమా కోసం రాజ‌మౌళి ఓ ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడిని రంగంలోకి దించ‌బోతున్న‌ట్టు సోష‌ల్ మీడియాలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇక రాజ‌మౌళి గురించి ఏ వార్త వ‌చ్చినా అది వైర‌ల్ కావ‌డం చూస్తూనే ఉన్నాం.

Advertisement

ఇక అలాంటిది ఎవెంజ‌ర్స్‌, స్టార్ వార్స్‌, ఎక్స్ఎక్స్ఎక్స్, జురాసిక్ పార్క్‌, స్పైడ‌ర్ మ్యాన్, కెప్టెన్ అమెరికా వంటి సూప‌ర్ హిట్ చిత్రాల్లో న‌టించిన హాలీవుడ్ యాక్ట‌ర్ శామ్యూల్ ఎల్ జాక్స్ ను తీసుకోబోతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ న‌టుడు ప్ర‌తి సినిమాకు రూ.80 కోట్లు నుంచి రూ.160 కోట్లు రెమ్యూన‌రేష‌న్ చార్జ్ చేస్తాడు. రాజ‌మౌళి సినిమాలో ఇత‌డు న‌టిస్తాడో లేదో తెలియాలంటే మాత్రం ఇక అధికారికంగా ప్ర‌క‌టించేంత వ‌ర‌కు మ‌న‌కు ఓ క్లారిటీ రానుంది.

Advertisement

Also Read :  సౌందర్య జీవితంలో చేసిన ఓకే ఒక్క తప్పు అదేనట….? ఆ తప్పు వల్లే చివరికి..!

ప్ర‌పంచాన్ని చుట్టి వ‌చ్చే సాహ‌సికుడి క‌థ అంటూ ఇటీవ‌ల ఈ సినిమాకు సంబంధించి ఓ అప్‌డేట్ ఇచ్చారు రాజ‌మౌళి. ఈ చిత్రం యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ గా తెర‌కెక్క‌బోతుంది. ఈ సినిమాను కే.ఎల్.నారాయ‌ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మ‌హేష్‌కు జోడిగా శ్ర‌ద్ధా క‌పూర్ నటించ‌బోతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి చిత్ర బృందం ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఇప్ప‌టికే ఆర్ఆర్ఆర్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసిన జ‌క్క‌న్న మ‌హేష్‌తో తీసే సిసినిమాతో ఎలాంటి సంచ‌ల‌నాల‌ను సృష్టిస్తాడో ఇక వేచి చూడాలి.

Also Read :  ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ పేరు మార్పుపై ద‌ర్శ‌కేంద్రుడు ఎమోష‌న‌ల్‌ ట్వీట్‌

Visitors Are Also Reading