రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కు నేడు విరామం ప్రకటించారు. రాహుల్ ప్రస్తుతం కేరళలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. విరామం తర్వాత మళ్లీ కేరళలోని కొల్లం జిల్లా నుండి శుక్రవారం యాత్ర ప్రారంభం కానుంది.
మన దేశంలో చిరుతలు అంతరించిపోతున్న జాబితాలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ మనదేశం లోకి నమీబియా నుండి ప్రత్యేక బోయింగ్ విమానం లో 8 చిరుతలను ప్రభుత్వం తీసుకుని వస్తోంది.
Advertisement
ప్రజా గాయని విమలక్క బహుజన బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 24న ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద వేడుకలు ప్రారంభించనుండగా అక్టోబర్ 3 వరకు రాష్ట్రం లోని పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
నేడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కీలక అంశాల పై చర్చించే అవకాశాలు ఉన్నాయి.
Advertisement
భద్రాచలం లో వరద ఉదృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 47 అడుగులు ఉండటం తో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు.
తిరుమల లో స్వామి వారి దర్శనం కు 18 గంటల సమయం పడుతుంది. 72 వేల మంది భక్తులు నిన్న స్వామి వారిని దర్శించుకున్నారు.
హైదరాబాద్ లోని హసన్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. బాబు ఖాన్ అనే రౌడీ షీటర్ ను దుండగులు దాడి చేసి హతమార్చారు.
సినీ కార్మికుల వేతనల సవరణకు ప్రొడ్యుసర్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
పాకిస్థాన్ క్రికెట్ జట్టులో విషాదం చోటు చేసుకుంది. ఐసిసి మాజీ అంపైర్ అసద్ రౌఫ్ (66) గుండెపోటు తో మరణించారు. ఆయన 170 మ్యాచ్ లకు పైగా అంపైర్ గా వ్యవహరించారు.
తెలంగాణ లో పంటల సాగు భారీగా పెరిగింది. చరిత్రలో మొట్టమొదటి సారి వానాకాలం లో ఈ ఏడాది 1.46 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు అవుతున్నాయి.