Home » నాగార్జున బిగ్ బాస్ షో నుంచి తప్పుకుంటున్నారా..? దాని వెనుక ఉన్న అసలు వివాదం ఇదేనా..?

నాగార్జున బిగ్ బాస్ షో నుంచి తప్పుకుంటున్నారా..? దాని వెనుక ఉన్న అసలు వివాదం ఇదేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

బిగ్ బాస్ షో మొదట్లో ప్రారంభమైనప్పుడు దీని గురించి ఎక్కువగా ఎవరు పట్టించుకోలేదు. ఫస్ట్ సీజన్ ముగిశాక రెండో సీజన్ లో హీరో నాని హోస్ట్ గా వచ్చినప్పుడు కాస్త ఇది పాపులారిటీ పెంచుకుంది. మూడవ సీజన్ లో హోస్ట్ గా నాగార్జున వచ్చిన తర్వాత షో రేటింగ్ అమాంతం పెరిగిపోయింది. బిగ్ బాస్ షో వస్తుందంటే ఎంతపని ఉన్నా పక్కన పెట్టి మరీ చూసేవారు అంటే దీనికి ఎంత పాపులారిటీ పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇలా 3,4 సీజన్ లు చాలా సక్సెస్ఫుల్ గా ముగిసాయి. ఇక 5 సీజన్ ఓటిటిలో 24 గంటల ప్రచారం జరిగింది. ఈ సీజన్ కూడా చాలా విజయవంతం అయింది. దీనికి హోస్ట్ గా నాగార్జున చేశారు. ఇది ముగిసాక 6 సీజన్ గురించి కూడా వార్తలు వస్తున్నాయి. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ వచ్చి పడింది.

6 సీజన్లో నాగార్జున కనిపించారని ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వేదికగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిలో నిజమెంతో, అబద్ధమెంతో తెలియదు కానీ నాగార్జున మాత్రం హోస్ట్ గా చేయరని, ఆయన మాజీ కోడలు సమంత రానున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. కట్ చేస్తే అసలు నాగార్జున ఎందుకు బిగ్ బాస్ నుంచి తప్పుకుంటున్నారు. దాని వెనుక ఉన్న కారణం ఏమిటి.. ఓ సారి తెలుసుకుందాం..? మూడవ సీజన్ నుండి నాగార్జున బిగ్ బాస్ ను ముందుంది నడిపిస్తూ ఓ రేంజ్ కి తీసుకెళ్లారు.

Advertisement

Advertisement

తాజాగా ఆయన షో నుంచి తప్పకునే ఆలోచనలో పడ్డట్టు సమాచారం. ఈ విషయంపై నాగార్జున ఇప్పటికే కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టు తెలుస్తున్నది. బిగ్ బాస్ షో చుట్టూ చాలా వివాదాలు వస్తున్నాయి . హౌస్ లో కంటెస్టెంట్ లు విచ్చలవిడిగా మాట్లాడుకుంటూ గొడవలు దిగుతున్నారని అనే వివాదాలు బిగ్ బాస్ షో చుట్టూ ముసురుకున్నాయి. అయితే ఈ షో పై రాజకీయ నాయకులు కూడా చాలా కామెంట్స్ చేశారు.. మీ షో బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో వీరంతా నాగార్జున పై కూడా విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో కింగ్ నాగార్జున షో లో చేయాలా వద్దా అని ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈ వివాదాల తరుణంలో ఈ షోలో హోస్ట్ గా చేయడానికి ఆలోచించుకోవాలని అనుకుంటున్నారట. దీని వల్లనే బిగ్బాస్ నుంచి నాగార్జున తప్పుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. అయితే నిజంగానే తప్పకుంటారా ఇదంతా సోషల్ మీడియా ద్వారా వస్తున్న ఫేక్ ప్రచారమా అనేది తెలియాలంటే 6 సీజన్ వరకు వెయిట్ చేయాల్సిందే.

also read;

“విక్రమ్” సినిమాలో “టీనా” ఎవరు..? ఇండస్ట్రీలోకి ఎలా వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

భూమిక భయంకరంగా తిట్టింది… సంచలన విషయాలు బయట పెట్టిన ఎం ఎస్ రాజు…!

 

Visitors Are Also Reading