Home » భూమిక భయంకరంగా తిట్టింది… సంచలన విషయాలు బయట పెట్టిన ఎం ఎస్ రాజు…!

భూమిక భయంకరంగా తిట్టింది… సంచలన విషయాలు బయట పెట్టిన ఎం ఎస్ రాజు…!

by AJAY
Published: Last Updated on
Ad

టాలీవుడ్ లోని టాప్ ప్రొడ్యూసర్స్ లో ఎమ్మెస్ రాజు కూడా ఒకరు. ఎమ్మెస్ రాజు కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఒక్కడు సినిమాలతో ఎమ్మెస్ రాజు బ్లాక్ బస్టర్ లు అందుకున్నారు. ఈ సినిమాలే ఎమ్మెస్ రాజు కెరీర్ ను టాప్ లో నిలబెట్టాయి. ఎమ్మెస్ రాజు కేవలం నిర్మాతగానే కాకుండా దర్శకుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. నిర్మాతగా ఎన్నో సినిమాలు చేసిన ఎమ్మెస్ రాజు వాన సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.

Advertisement

Advertisement

ఈ సినిమా తరవాత ఎం ఎస్ రాజు తన కుమారుడు హీరోగా తూనీగ తూనీగ అనే సినిమా చేశాడు. ఈ సినిమా అనుకున్నమేర విజయం సాధించలేదు. ఇక ఇప్పుడు ఎం ఎస్ రాజు ఎక్కువగా బోల్డ్ సినిమాలు చేస్తూ యూత్ కు వినోదాన్ని పంచుతున్నారు. ఇప్పటికే డర్టీ హరి సినిమా తో ఎం ఎస్ రాజు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. తాజాగా తన కుమారుడు సుమంత్ అశ్విన్ హీరోగా 7డేస్ 6 నైట్స్ అనే మరో సినిమా చేశారు.

ఈ సినిమా కూడా యూత్ కోసమే చేసినట్టు ఉంది. జూన్ 24 న ఈ సినిమా థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యం లో ఎం ఎస్ రాజు ప్రమోషన్స్ లో బిజీ అయ్యారు. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఒక్కడు సినిమా షూటింగ్ సమయం లో భూమిక ఫైటర్ పై ఎందుకు అరిచారు అని ప్రశ్నించారు. దానికి ఎం ఎస్ రాజు మాట్లాడుతూ…తాను మహేష్ బాబు భూమిక పక్కపక్కనే కూర్చున్నాము అని చెప్పాడు. ఆ సమయంలో భూమిక ఒక్కసారిగా లేచి ఫైటర్ ను ఇంగ్లీష్ లో దారుణంగా తిట్టింది అన్నారు. కానీ ఆమె ఏమని తిట్టింది ఎందుకు తిట్టిందో అర్థం కాలేదని చెప్పారు.

Visitors Are Also Reading