Home » “విక్రమ్” సినిమాలో “టీనా” ఎవరు..? ఇండస్ట్రీలోకి ఎలా వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

“విక్రమ్” సినిమాలో “టీనా” ఎవరు..? ఇండస్ట్రీలోకి ఎలా వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

by Sravanthi
Ad

ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచమే కాదు. అనేక హంగులు కలిగిన నటుల సమూహం.. ఇందులో సముద్రపు అలలు ఏ విధంగా పడుతూ లేస్తూ ఉంటాయో. సినిమా ఇండస్ట్రీలో కూడా నటులు పడుతూ లేస్తూ తన గమ్యాన్ని చేరుకోవాలి. ఈ తతంగంలో సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. కాని వాళ్ళు ఉంటారు.

Advertisement

సక్సెస్ కోసం పరుగెడుతున్న వాళ్ళు ఉంటారు. అయితే కొంతమంది నటులు సక్సెస్ కావడానికి కొంత సమయం పడుతుంది. కొంతమంది ఓవర్ నైట్ లోనే సక్సెస్ దారిన పడతారు. ఇదంతా మన నటన సామర్థ్యం మీదనే ఆధారపడి ఉంటుంది. కొంతమంది అనుకోకుండా ఓవర్ నైట్ లో ఎంతో పేరు సంపాదించి స్టార్ డం తెచ్చుకుంటారు. అదే దారిలో వచ్చింది నటి వాసంతి. వాసంతి అంటే ఎవరు గుర్తుపట్టలేదు కదూ.. విక్రమ్ సినిమాలోని ఏజెంట్ టీనా.. అబ్బా ఇప్పుడు గుర్తొచ్చిందా..

ప్రస్తుతం ఈ నటి తమిళ ఇండస్ట్రీలో ఓవర్ నైట్ లోనే ఎంతో పేరు సంపాదించిందని చెప్పవచ్చు. ఈమె ఇంటర్వ్యూ కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. కమల్ హాసన్ హీరోగా దర్శకుడు లోకేష్ కనకరాజు నిర్మించిన చిత్రం విక్రమ్.. ప్రస్తుతం ఈ మూవీ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటుగా విజయ్ సేతుపతి, సూర్య, పహద్ పాజిల్, ఇంకా స్టార్ నటీనటులు నటించారు. వీరితో పాటుగా ఈ మూవీలో టీనా పాత్రకు కూడా చాలా పేరు దక్కింది. ఇందులో వాసంతి క్యారెక్టర్ రెండు రకాలుగా ఉంటుంది. మూవీ మొత్తం ఏమీ తెలియని పని మనిషిగా కనిపించే టీనా..

ప్రీ క్లైమాక్స్ లో మాత్రం తన అసలు రూపాన్ని బయటకు తీసుకు వస్తుంది. ఆమె ఒక రా ఏజెంట్.. విక్రమ్ ఫ్యామిలీ ప్రొటెక్టర్ గా పని చేస్తూ ఉంటుంది. విక్రం మనవడిని హత్య చేయడానికి వచ్చే విలన్ కి ఆమె చుక్కలు చూపిస్తుంది. అప్పటివరకు పనిమనుషుల చూసిన ఆమెను ఈ విధంగా విశ్వరూపం చూపించే సరికి ఆడియన్స్ అంతా ఆశ్చర్యపోతారు.. సైలెంట్ గా ఇంకా ఏం జరుగుతుందని చూసే విధంగా టీనా పాత్రను తీర్చిదిద్దారు డైరెక్టర్ కనకరాజు. ఈ విధంగా విక్రమ్ సినిమాలో టీనా పాత్రకు ఎంతో పేరు వచ్చింది.

Advertisement

టీనా ఎవరు, బ్యాక్ గ్రౌండ్ ఏంటో చూద్దామా.?
ఏజెంట్ టీనా అసలు పేరు వాసంతి. చెన్నైలో పుట్టి పెరిగింది. ఒక సామాన్య కుటుంబం నేపథ్యం ఆమెది. వృత్తిరీత్యా డాన్సర్ తమిళ మూవీస్ లో గ్రూప్ డాన్సర్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసింది. చాలా కష్టపడి అసిస్టెంట్ డాన్స్ కొరియోగ్రాఫర్ గా మారింది. 1992 నుంచే ఆమె ఇండస్ట్రీలో ఉన్నారు. ఆమె 30 సంవత్సరాల ఇండస్ట్రీ ప్రయాణంలో అనేక నృత్య కొరియోగ్రాఫర్లతో పని చేసింది. ప్రస్తుతం ఆమె డాన్స్ కొరియోగ్రాఫర్ దినేష్ మాస్టర్ టీమ్ లో పని చేస్తోంది. అయితే విజయ్ మాస్టర్ తో ఒక పాటకు వాసంతి అసిస్టెంట్ గా పని చేసింది. ఆ సమయంలోనే లోకేష్ కనకరాజు ఆమెను చూశాడు. అప్పుడే ఆమెను విక్రమ్ సినిమాలో తీసుకు రావాలని నిర్ణయించుకున్నాడు. ఈ విధంగా ఆమె ఈ మూవీలో నటించడానికి సిద్ధమైంది. తన పర్ఫార్మెన్స్ తో ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీ లోనే ఓవర్ నైట్ లో మంచి పేరు సంపాదించింది అని చెప్పవచ్చు. ఆమె గురించి సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది.

also read;

పెళ్ళికి ముందే మీ లైఫ్ పార్ట్నర్ గురించి ఈ 4 విషయాలు తప్పక తెలుసుకోండి…లేదంటే అంతే సంగతి….!

భూమిక భయంకరంగా తిట్టింది… సంచలన విషయాలు బయట పెట్టిన ఎం ఎస్ రాజు…!

 

Visitors Are Also Reading