సాధారణంగా దేవాలయాల్లో ఎక్కడైనా ప్రసాదం అనగానే పులిహోర, కేసరి, దద్దోజనం, నైవిద్యం ఇలా పంపిణి చేస్తుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో మాత్రం పరిస్థితి విభిన్నంగా ఉంటుంది. ఈ ఆలయంలో ప్రసాదం కింద భక్తులకు గోధుమ నూకతో చేసిన ప్రసాదం అందిస్తారు. ఈ ప్రసాదం చాలా రుచికరంగా ఉంటుంది. ఇక్కడ లభించే ప్రసాద మరెక్కడ లభించదు. తిరుపతి లడ్డూ ఎంత ప్రసిద్ధి చెందిందో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అదే మాదిరిగా అన్నవరం ప్రసాదం కూడా అదేస్థాయిలో ఆదరణ పొందిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
Advertisement
అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో గోధుమ నూకతో ప్రసాదం ఎందుకు చేస్తారు..? ఈ సంప్రదాయమును అసలు ఎవరు ప్రారంభించారు..? అనే విషయాలపై అధికారులకు సైతం ఇంకా క్లారిటీ లేదు. కానీ ఈ ప్రసాదం అందరికీ నచ్చుతోంది. అందుకే ఈ ప్రసాదమును కొనసాగిస్తున్నట్టు అన్నవరం దేవస్థానం అధికారులు పేర్కొంటున్నారు. అన్నవరం సత్యనారాయణ స్వామి వారికి గోధుమలతో తయారు చేసిన పదార్థాలతో చేసిన నైవేద్యం సమర్పించడం ఆనాటి నుంచి ఆచారం. ఆ ఆచారాన్ని అలాగే కొనసాగిస్తూ.. గోధుమ నూకతో తయారు చేసిన ఆహారాన్ని భక్తులకు అందిస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. ఇక గోధుమ నూకకు పంచదార, నెయ్యి కలపడంతో వచ్చిన రుచి అందరికీ నచ్చడంతో దానినే ప్రసాదంగా అందిస్తున్నామని ఆలయ అధికారులు వెల్లడించారు. ప్రసాదం తయారీ ఎలా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
అన్నవరం ప్రసాదం తయారీకి ప్రధానంగా గోధుమ నూక, నెయ్యి, పంచదార, యాలకుల పొడి వాడుతారు. తొలుత నీళ్లు బాగా మరిగించి.. అందులో గోధుమ నూక వేస్తారు. ఆ తరువాత పంచదార వేసి రంగు మారే వరకు ఉడకబెడతారు. చివరిలో నెయ్యి వేసి కలుపుతారు. అన్నవరం ప్రసాదం తయారీకి వాడేది కీలకం నాలుగు పదార్థాలే అయినా రుచి మాత్రం చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఈ ప్రసాదాన్ని ప్రత్యేకంగా ఫ్యాక్ చేయించి దూర ప్రాంతాలకు తీసుకెళ్తుంటారు. అన్నవరం ప్రసాదంలో మరొక ప్రత్యేకత ఏంటంటే..? ఫ‌్యాకింగ్ కోసం కేవలం విస్తరాకులు మాత్రమే వాడతారు. అందువల్ల అన్ని వేళలా ఈ ప్రసాదము రుచిని కలిగి ఉంటుంది. మిగతా ఆలయాల తరహాలో ప్లాస్టిక్ కవర్లలో ప్రసాదం ఫ్యాకింగ్ అన్నవరం దేవాలయంలో అసలు అందించరు.
Also Read :
సౌందర్యకు తీరని కోరిక ఉండేదట.. అది ఏంటో తెలిస్తే మీరు కన్నీరు పెడతారు..?
తనను తానే పెళ్లి చేసుకోబోతున్న యువతి.. ఎక్కడో తెలుసా..?