Home » త‌న‌ను తానే పెళ్లి చేసుకోబోతున్న యువ‌తి.. ఎక్క‌డో తెలుసా..?

త‌న‌ను తానే పెళ్లి చేసుకోబోతున్న యువ‌తి.. ఎక్క‌డో తెలుసా..?

by Anji
Ad

పెళ్లి అంటే ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య జ‌రిగేది. ఆడ‌, మ‌గ క‌లిసి ఎక్కువ‌గా పెళ్లి చేసుకుంటారు. నూటిలో ఒక‌రిద్ద‌రూ ఆడ‌, ఆడ‌, మ‌గ, మ‌గ ఇలా పెళ్లి చేసుకుంటారు. ఇక ఇప్పుడు రోజు రోజుకు రోజులు మారుతున్నాయి. ఇక లింగ బేధాలు లేకుండా స్వ‌లింగ సంప‌ర్కులు కూడా పెళ్లి చేసుకుంటున్నారు. మ‌రికొంద‌రూ అయితే చెట్లు, బెడ్‌షీట్లు ఇలా త‌మ‌కు న‌చ్చిన వ‌స్తువులు, జంతువుల‌ను సైతం పెళ్లాడ‌డం వంటివి విదేశాల్లో జ‌ర‌గ‌డం మ‌నం త‌రుచూ వింటుంటాం. తాజాగా మీరు తెలుసుకోబోయే పెళ్లి మాత్రం ఆ టైప్ అస‌లే కాదు. ఈ వివాహంలో మీకు కేవ‌లం వ‌ధువు మాత్ర‌మే ఉంటుంది. వ‌రుడు క‌నిపించ‌డు. అలాగ‌ని ఆమె మ‌రొక యువ‌తిని పెళ్లి చేసుకుంటుంద‌ని అనుకోవ‌ద్దు. తన‌ను తానే పెళ్లి చేసుకుంటుంది. అవును అండీ.. ఇది ఎక్క‌డో కాదు.. మ‌న భార‌త‌దేశంలోనే అండి.

Advertisement

గుజ‌రాత్‌లోని వ‌డోద‌ర‌కు చెందిన 24 సంవ‌త్స‌రాల వ‌య‌సు క‌లిగిన క్ష‌మాబిందు అనే యువ‌తి త‌న‌ను తాను పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ది. జూన్ 11న హిందూ సంప్ర‌దాయ ప్ర‌కారం.. త‌న‌కు తానుగానే మూడు ముళ్ల‌ను వేసుకొని పెళ్లి చేసుకోనున్నది. గోత్రిలోని గుడిలో జ‌ర‌గ‌నున్న ఈ వివాహంలో ఆమె 5 ప్ర‌మాణాల‌ను కూడా చేయ‌నున్న‌ది. అంతేకాదు.. వివాహం త‌రువాత గోవాల్ రెండు వారా హ‌నీమూన్ కోసం ఇప్ప‌టికే ప్లాన్ కూడా సిద్ధం చేసుకుంది. భార‌త్‌లో ఇలాంటి పెళ్లి జ‌ర‌గ‌డం ఇదే మొద‌టిసారి కావ‌డం విశేషం.

Advertisement


తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నేను పెళ్లి చేసుకోవాల‌ని ఎప్పుడు కోరుకోలేద‌ని చెప్పింది. నేను వ‌ధువు కావాల‌ని కోరుకున్నాన‌ని వెల్ల‌డించింది. అందుకోస‌మే నేను పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు వెల్ల‌డించింది. ఆన్‌లైన్ లో నేను దాని గురించి విస్తృతంగా చ‌దివాను. భార‌త్‌లో ఇలాంటి పెళ్లి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ర‌గ‌లేదు అని.. సెల్ప్ మ్యారేజ్ అనేది నీకు నువ్వే హ‌ద్దులు లేని ప్రేమ చూపించుకునేది అని చెప్పుకొచ్చింది. నీకు నువ్వే ఒప్పుకోవాల్సి ఉంటుంది. కొంద‌రూ ఎవ‌రినైనా ప్రేమిస్తే.. వారిని పెళ్లి చేసుకుంటారు. కానీ నేను న‌న్ను నేనే ప్రేమిస్తున్నాను.. అందుకే పెళ్లి చేసుకుంటున్నా అని క్ష‌మా వివ‌రించింది. త‌న త‌ల్లిదండ్రులు కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్న‌ట్టు తెలిపింది. ఈ వార్త ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Also Read : 

Bigg Boss 6 : బిగ్‌బాస్ 6లో మెర‌వ‌నున్న జ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీ..!

“గే సినిమా” అంటూ ఆర్ఆర్ఆర్ పై నెట్టింట దారుణ‌మైన ట్రోల్స్..!

 

Visitors Are Also Reading