ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కంటే చాలా ముందుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. విద్యాపరంగా అయితే ఈ ఏడాది ముందే ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే ఏపీలో ఇంటర్మీడియట్, పదవతరగతి పరీక్షలు నిర్వహించారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. తెలిపారు. మే 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరగబోయే పదవతరగతి పరీక్షలకు 5,09,275 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో పదవతరగతి పరీక్షల ఫలితాలను జూన్ 10న వెల్లడించేందుకు కసరత్తు చేస్తున్నట్టు పాఠశాల విద్య రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి వెల్లడించారు.
Advertisement
చిత్తూరు జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న పదవతరగతి మూల్యాంకన ప్రక్రియను ఆయన తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 2021-22 విద్యాసంవత్సరం 6,22,537 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్టు వెల్లడించారు. ఏప్రిల్ 27న ప్రారంభం కాగా.. మే 09న ముగిసాయి. ఇక పరీక్షల సమయంలో పేపర్ల లీక్, మాల్ ప్రాక్టీస్ అంటూ హడావిడి జరిగినా ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు రాకుండా పరీక్షలను పూర్తి చేసింది. మే 13 నుండి పేపర్ వాల్యూయేషన్ జరుగుతోందని.. ఇప్పటికే దాదాపు 25 శాతం మేరకు పేపర్ల వాల్యూయేషన్ పూర్తి అయిందని తెలిపారు. అన్ని జిల్లాల్లో ఉమ్మడి జిల్లా డీఈవోలు క్యాంపు ఆఫీసర్లుగా మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.
Advertisement
విజయవాడలోని రాష్ట్ర పరీక్షల విభాగం కార్యాలయంలో డీ కోడింగ్ ప్రక్రియ నిర్వహించి.. జూన్ 10న ఫలితాలను వెల్లడించేందుకు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. 2022-23 విద్యాసంవత్సరం నుంచి 26 జిల్లాలను యూనిట్‌గా తీసుకొని పదవతరగతి పరీక్షలను నిర్వహిస్తామని దేవానందరెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే.. ఏపీలో అన్ని పరీక్షలు ముందస్తుగా నిర్వహించి ఫలితాల తేదీలను ప్రకటిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం వెనుకంజలో ఉందని పలువురు పేర్కొన్నారు. ఎప్పుడు ఏపీ కంటే అన్ని పరీక్షలను ముందుగా నిర్వహించే తెలంగాణ ఇప్పుడు ఇలా ఆలస్యంగా నిర్వహిస్తుందని చర్చించుకోవడం గమనార్హం.
Also Read :
త్రివిక్రమ్ – మహేష్ బాబు సినిమా విడుదల ఎప్పుడంటే…?
Sarkaru Vaari Paata Ott: ఓటీటీలో సర్కారు వారి పాట స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా..?