Home » త్రివిక్రమ్ – మహేష్ బాబు సినిమా విడుదల ఎప్పుడంటే…?

త్రివిక్రమ్ – మహేష్ బాబు సినిమా విడుదల ఎప్పుడంటే…?

by Azhar
Ad

దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట అనే సినిమాతో అభిమానుల ముందుకు వచ్చాడు. అయితే మహేష్ ఎప్పుడు ప్రతి ఏడాది సంక్రాంతికి ఓ సినిమా విడుదల చేసే వాడు. 2020 లో కూడా అలాగే సంక్రాంతి సరిలేరు నీకెవ్వరూ అనే సినిమాతో అభిమానుల ముందుకు వచ్చాడు. కానీ గత రెండేళ్లుగా కరోనా కారణంగా అది సాధ్యపడలేదు. అందుకే ఈ ఏడాది కూడా సంక్రాంతికి రావల్సిన సర్కారు వారి పాట సమ్మర్ లో వచ్చింది.

Advertisement

ఇక ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో…. మహేష్ బాబు తర్వాత సినిమా ఎవరితో అనేది పెద్ద చర్చగా మారింది. ఎందుకంటే ఈ ఏడాది మార్చిలో ఆర్ఆర్ఆర్ విడుదల చేసిన రాజమౌళి తన తర్వాతి సినిమా మహేష్ బాబుతో అని ప్రకటించాడు. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ తో తాను ప్రకటించిన ఈ సినిమాను వాయిదా వేసి…. తన తర్వాతి సినిమా మహేష్ బాబుతో అని పేర్కొన్నాడు. ఈ క్రమంలో మహేష్ బాబు ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది పెద్ద చర్చగా మారింది

Advertisement

అయితే రాజమౌళి సినిమా అంటేనే అది ప్రారంభానికి ముందే అన్ని రకాలుగా పనులు జరగడానికి ఒక ఏడాది అయినా సమయం పడుతుంది. కాబట్టి ఈ ఏడాది గ్యాప్ లో మహేష్ త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూలైలో త్రివిక్రమ్ మహేష్ తో సినిమా ప్రారంభించి డిసెంబర్ కల్లా షూటింగ్ను పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇలా చేసి మహేష్ బాబు ఎప్పుడూ ఫాలో అయ్యే సంక్రాంతికి ఆ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు మేకర్స్. అయితే ఇది సాధ్యపడుతుందా లేదా అనేది మాత్రం తెలియదు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

ఇవి కూడా చదవండి :

ఇంగ్లాండ్ పర్యటనకు రహానే దూరం..!

వంటి చేసి ఫైన్ కఠిన సంజూ, చాహల్..!

Visitors Are Also Reading