Home » చెన్నై జట్టునుండి రాయుడి తొలగింపు.. ఎందుకో తెలుసా…?

చెన్నై జట్టునుండి రాయుడి తొలగింపు.. ఎందుకో తెలుసా…?

by Azhar
Ad

ఐపీఎల్ 2021 విజేతగా ఈ ఐపీఎల్ 2022 లో అడుగు పెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. అనుకున్న విధంగా రాణించలేకపాయింది. అందుకే మూడు మ్యాచ్ లు మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్ రేస్ నుండి బయటకు వచ్చేసింది. అయితే నిన్న ఈ జట్టు స్టార్ ఆటగాడు అంబటి రాయుడు.. తనది ఇదే ఆఖరి సీజన్ అని… ఈ ఐపీఎల్ తర్వాత నేను రిటైర్ అవుతాను అని ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. కానీ కొద్ది సేపటికే మళ్ళీ దానిని డిలీట్ చేసాడు.

Advertisement

ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం రాయుడి ట్విట్ పై స్పందిస్తూ… రాయుడు కొంత మనస్తాపానికి గురయ్యాడు. అతను అనుకున్న విధంగా ఈ సీజన్ లో రాణించలేకపోతున్నాను అని అనుకుంటున్నట్లు ఉన్నాడు. అందుకే ఇలా చేసాడు. కానీ మళ్ళీ డిలేట్ చేసాడు. కాబట్టి ఈ కథ ముగిసిపోయింది. అతను వచ్చే సీజన్ లో కూడా మాతోనే ఉంటాడు. చెన్నై జట్టుకి ఇంకా అతని అవసరం ఉంది పేర్కొంది. కానీ ఈరోజు గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో రాయుడు జట్టులో లేడు. దాంతో అభిమానులు రకరకాలుగా ఉహించుకుంటున్నారు.

Advertisement

అయితే నేటి మ్యాచ్ లో రాయుడు ఎందుకు లేడు అనేది చెన్నై కెప్టెన్ ధోని చెప్పాడు. ఈ మ్యాచ్ లో ఏకంగా నాలుగు మార్పులు చేసిన చెన్నై. రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, డ్వేన్ బ్రావో, తీక్షణలను పక్కన బెట్టి.. జట్టులోకి జగదీషన్, ప్రశాంత్ సోలంకి, సాంట్నర్, మతీషా ను తీసుకుంది. ఇక జట్టు భవిష్యత్తును సృష్టిలో పెట్టుకొనే ఇలా చేసాం అని ధోని తెలిపాడు. అయితే ఈ మ్యాచ్ లో చెన్నై గుజరాత్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

కేన్ విలియమ్సన్ పై లారా అసహనం…!

నేను మా సీఈవో పేరు అందుకే తీసాను : శ్రేయాస్

Visitors Are Also Reading