Home » నేను మా సీఈవో పేరు అందుకే తీసాను : శ్రేయాస్

నేను మా సీఈవో పేరు అందుకే తీసాను : శ్రేయాస్

by Azhar
Ad

ఐపీఎల్ 2022 లో శ్రేయాస్ అయ్యర్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న విషయం అందరికి తెలిసిందే. గత ఏడాది వరకు ఢిల్లీకీ ఆడిన అయ్యర్ ఈ ఏడాది కేకేఆర్ కు కెప్టెన్ గా మొదట్లో మంచి విజయాలను అందించాడు. కానీ అనంతరం ఆ జట్టులో జరిగిన మార్పులతో… కేకేఆర్ ను వరుస పరాజయాలు పలకరించాయి. ఈ ఐపీఎల్ లో ఇప్పటివరకు కేకేఆర్ చేసిన్నని మార్పులు తుది జట్టులో మారె జట్టు చేయలేదు.

Advertisement

వరుస పరాజయాల తర్వాత కేకేఆర్ ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించింది. ఈ మ్యాచ్ తర్వాత శ్రేయాస్ మాట్లాడుతూ… జట్టు ఎంపికలో మా సీఈవో కూడా జోక్యం చేసుకుంటున్నారు అని చెప్పారు. దాంతో అయ్యర్ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.. అసలు కేకేఆర్ ఓడిపోవడానికి ఈ సీఈవో జోక్యంమే.. కారణం అందుకే ఈ జట్టులో ఇన్ని మార్పులు జరుగుతున్నాయి అని కామెంట్స్ చేస్తుం వచ్చారు. కానీ తాజాగా అయ్యర్ తన వ్యాఖ్యల పై క్లారిటీ ఇచ్చారు.

Advertisement

నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయాస్ నేను ఓ క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. నేను గత మ్యాచ్ లో మా సీఈవో పేరు ఎందుకు తీసాను అంటే… ఆయన తుది జట్టులో అవకాశాలు రాని ప్లేయర్స్ తో కలిసి మాట్లాడుతూ.. వారికీ పరిస్థితులను వివరించే పనిలో ఉన్నారు. అందుకే నేను మా సీఈవో పేరు తీసాను. కానీ అందరూ వేరే విధంగా అర్థం చేసుకున్నారు’అని అయ్యర్ తెలిపాడు.

ఇవి కూడా చదవండి :

ఉమ్రాన్ పై అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

కేన్ విలియమ్సన్ పై లారా అసహనం…!

Visitors Are Also Reading