Home » ఎండకు చెమట పొక్కులు వస్తున్నాయా.. చిన్న చిట్కాలతో ఉపశమనం..!!

ఎండకు చెమట పొక్కులు వస్తున్నాయా.. చిన్న చిట్కాలతో ఉపశమనం..!!

by Sravanthi
Ad

వేసవి కాలంలో ఎండ తీవ్రత కి చెమటలు బాగా పట్టి,బట్టలన్నీ తడిసిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా అవడం వల్ల వేసవి కాలంలో చాలా మందికి చెమట పొక్కులు వస్తాయి. ముఖ్యంగా చంటి పిల్లల్లో, స్త్రీలలో ఎక్కువగా చెమట పొక్కులు వస్తాయి. ఇలా ఎందుకు వస్తాయంటే.. స్వేద గ్రంథులు వ్యర్థం అంతా కూడా చెమట రూపంలో బయటకు పంపిస్తాయి.కొన్ని సందర్భాల్లో స్వేద గ్రంథులు మూసుకుపోయినప్పుడు అక్కడ వ్యర్థం మొత్తం ఆగి చెమటపొక్కులు ఏర్పడతాయి. దీనికి పరిష్కారం ఏమిటంటే.. ఇంట్లోనే మొహానికి ఆవిరి పట్టుకునే యంత్రంలో నీళ్లు పోసి మరిగించి దుప్పటి ముసుగేసి ఆ దుప్పట్లో కూర్చొని ఎక్కడైతే చెమట పొక్కులు వచ్చాయో అక్కడ ఆవిరి తగిలేటట్టు చూడాలి. ఇలా చేయడం వల్ల స్వేద గ్రంధులు తెరుచుకొని సమస్య పరిష్కారం అవుతుంది.ఇలా ఏ భాగంలో అయితే చెమటపొక్కులు వస్తాయో అక్కడ ఆవిరి పట్టుకున్నట్లైతే చెమట పొక్కులు తగ్గుముఖం పడతాయి. అలాగే వేసవికాలంలో కాటన్ దుస్తులను ధరించడం చాలా మంచిది. అలాగే టైట్ గా ఉండే దుస్తులను ధరించకూడదు. ఇలా చేస్తే స్వేద రంధ్రాలు మూసుకుపోతాయి. వేసవికాలంలో రెండు సార్లు స్నానం ఖచ్చితంగా చేయాలి. చెమట పొక్కులు వచ్చిన వారైతే మూడు సార్లు స్నానం చేసిన పర్లేదు.

Advertisement

ALSO READ :

Advertisement

2 రెండు రోజులు తిండి త‌ప్ప‌లు మానేసి ఏడుస్తూ కూర్చున్నా..దేవినాగ‌వ‌ల్లి ఎమోష‌న‌ల్..

మీ ఇంట్లో చిల్లర డబ్బులు ఈ ప్రదేశంలో పెడితే ఇక ధనవర్షమే..!!

 

 

Visitors Are Also Reading