భారత క్రికెట్ జట్టుకు ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో కెప్టెన్ గా రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. మొదట టీ20 జట్టుకు కోహ్లీ కెప్టెన్ గా తప్పుకోగా.. తర్వాత వన్డే జట్టుకి బీసీసీఐ కోహ్లీని తప్పించి రోహిత్ ను కెప్టెన్ ను చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకే టెస్ట్ కెప్టెన్ గా కూడా విరాట్ కోహ్లీ తప్పుకుంటే.. ఆ బాధ్యతలను కూడా రోహిత్ శర్మ చేతిలో పెట్టింది బీసీసీఐ.
Advertisement
కానీ ఇప్పుడు ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాడు భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్. తాజాగా యువి మాట్లాడుతూ… రోహిత్ ను టెస్ట్ కెప్టెన్ గా చేయడం బీసీసీఐ అనాలోచితంగా తీసుకున్న నిర్ణయంలాగా కనిపిస్తుంది. ఎందుకంటే.. రోహిత్ టెస్టులో తన స్థానం కేవలం రెండేళ్ల కిందటే సంపాదించుకున్నాడు. ఇటువంటి సమయంలో అతను తన బ్యాటింగ్ పై ఫోకస్ చేయడం.. అతనికి అలాగే జట్టుకు మంచింది.
Advertisement
కానీ ఇప్పుడు అతనికి కెప్టెన్సీ ఇవ్వడం అతనిపైన ఒత్తిడిని పెంచుతుంది. అలాగే రోహిత్ ఎక్కువగా గాయాలబారిన పడుతున్నాడు. కాబట్టి అతను తన ఫిట్నెస్ పైన దృష్టి పెట్టాలి.. కానీ ఈ కెప్టెన్సీ ఆలా చేయనివ్వట్లేదు. కోహ్లీ కెప్టెన్ గా తప్పుకోవడంతో ఎమోషనల్ గా ఆ పగ్గాలను రోహిత్ కు బీసీసీఐ అప్పగించింది అని నేను అనుకుంటున్నాను అంటూ యువి పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి :
చెన్నై కెప్టెన్ గా మళ్ళీ ధోనినే…!