Home » Acharya : సెన్సార్ పూర్తి చేసుకున్న ఆచార్య‌.. టాక్ ఎలా ఉందంటే..?

Acharya : సెన్సార్ పూర్తి చేసుకున్న ఆచార్య‌.. టాక్ ఎలా ఉందంటే..?

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పూర్తిస్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకున్న మూవీ ఆచార్య. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుద‌లైన ట్రైల‌ర్‌, పాట‌లు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. ముఖ్యంగా భ‌ల భ‌లే బంజారా సాంగ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ పాట‌లో చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌ల స్టెప్పులు అదుర్స్ అంటున్నాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. అంతేకాదు.. సెన్సార్ వాళ్లు యూ/ఏ స‌ర్టిఫికెట్ అంద‌జేశారు. ఈ చిత్రానికి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప‌లు వాయిదాల తరువాత ఈ సినిమా ఏప్రిల్ 29న విడుద‌ల‌వ్వ‌నుంది. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌డంతో ఆచార్య టీమ్ ప్ర‌మోష‌న్స్‌ను ముమ్మ‌రం చేసింది. ఆచార్య సినిమాను మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌తో క‌లిసి రామ్‌చ‌ర‌ణ్‌, కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో సంయుక్తంగా నిర్మించారు.

Advertisement

మ‌హేష్‌బాబు వాయిస్ ఓవ‌ర్ అందించారు. ఇప్ప‌టికే మ‌హేష్ బాబు ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌ల్సా, ఎన్టీఆర్ బాద్‌షా, త‌న తండ్రి కృష్ణ న‌టించిన శ్రీ‌శ్రీ మూవీకి వాయిస్ ఓవ‌ర్ అందించారు. తాజాగా చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ ఆచార్య సినిమాకు వాయిస్ ఓవ‌ర్ అందించారు. మ‌హేష్ గొంతుతోనే ఆచార్య సినిమా మొద‌లవుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాజ‌మౌళి ముఖ్యఅతిథిగా రాబోతున్న‌ట్టు స‌మాచారం. ఈ చిత్రంలో యాక్ష‌న్ స‌న్నివేశాలు ర‌క్త‌పాతం వంటి దృష్ట్యాలు ఉండ‌డంతో సెన్సార్ U/A స‌ర్టిఫికేట్ జారీ చేసారు. అంతేకాదు.. ఇందులో చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ ఇంట్ర‌డ‌క్ష‌న్ స‌న్నివేశాలు ఆస‌క్తి రేకెత్తించేవిధంగా ఉన్నాయంటూ సెన్సార్ టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా ధ‌ర్మస్థ‌లితో పాటు హైంద‌వ సాంప్ర‌దాయాలకు ఈ చిత్రంలో ప్రాధాన్య‌త ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

Advertisement


మ‌రొక విష‌యం ఏమిటంటే ఈ చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్ చనిపోతాడ‌నే టాక్ వినిపిస్తోంది. గ‌తంలో రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన మ‌గ‌ధీర‌, ఎవ‌డు చిత్రాల్లో చ‌నిపోయే పాత్ర‌ల్లో న‌టించారు. ఆయా సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. అదే కోవ‌లో ఆచార్య రామ్ చ‌ర‌ణ్ పాత్ర‌ సిద్ధ చ‌నిపోవ‌డం క‌లిసి వ‌స్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తూ ఉన్నారు. ఇక ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ మిర్చి, శ్రీ‌మంతుడు, జ‌న‌తా గ్యారేజ్‌, భ‌ర‌త్ అను నేను వంటి సినిమాల‌ను తెర‌కెక్కించి స‌క్సెస్ సాధించారు.ఆచార్య‌కు మ‌రి అదే సెంటిమెంట్ కలిసొస్తుందో లేదో చూడాలి. మ‌రో సెంటిమెంట్ ఏమిటంటే.. మెగాస్టార్‌తో కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించిన ఖైదీ నెంబ‌ర్ 150 సూప‌ర్ హిట్ అయింది. కాజ‌ల్-రామ్‌చ‌ర‌ణ్ మ‌గ‌ధీర, నాయ‌క్, గోవిందుడు అందరి వాడేలే సినిమాలు కూడా హిట్‌గానే నిలిచాయి. అదే సెంటిమెంట్ ఆచార్య‌కు కూడా క‌లిసొస్తుందే లేదో ఏప్రిల్ 29 వ‌ర‌కు ఎదురు చూడాలి.

ఇవి కూడా చ‌ద‌వండి :

మొదటి భార్య అనితతో దిల్ రాజుకు గొడవలు…ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

ఆ హీరోయిన్ అంటే కోట శ్రీనివాసరావుకు చాలా ఇష్టమట.. కానీ ఏం చేస్తాం..!!

Visitors Are Also Reading