Home » Chanakya Niti : మ‌నిషిని విజ‌య‌ప‌థంలోకి తీసుకెళ్లే ఐదు సూత్రాలు ఇవే..!

Chanakya Niti : మ‌నిషిని విజ‌య‌ప‌థంలోకి తీసుకెళ్లే ఐదు సూత్రాలు ఇవే..!

by Anji
Ad

ఆర్థిక వేత్త‌, గొప్ప పండితుడు, ఆచార్య చాణ‌క్యుడు త‌న నీతి శాస్త్రంలో మాన‌వ జీవితానికి సంబంధించిన ప‌లు విష‌యాల‌ను ప్ర‌స్తావించాడు. ఆయ‌న చెప్పిన మాట‌లు నేటికి ప్ర‌భావంతంగా స‌త్యానికి ద‌గ్గ‌ర‌గా ఉండ‌డం విశేషం. ఆచార్య చాణక్య మ‌నిషికి త‌ప్ప‌కుండా ఉండాల్సిన కొన్ని ల‌క్ష‌ణాల గురించి వివ‌రించాడు. ఈ ల‌క్ష‌ణాలు క‌లిగిన వ్య‌క్తి ధ‌న‌వంతులు అవ్వ‌కుండా ఎవ్వ‌రూ ఆప‌లేరు. ఇక విజ‌య ప‌థంలోకి తీసుకెళ్లే ఐదు సూత్రాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

జ్ఞానం

Chanakya

Chanakya

చాణ‌క్య నీతి ప్ర‌కారం.. జ్ఞానం అనేది మ‌నిషి జీవితాంతం అంటిపెట్టుకొని ఉండే మూల‌ధ‌నం. విజ‌యాన్ని పొందాలంటే జ్ఞానం క‌లిగి ఉండాలి. మీరు చేస్తున్న ప‌ని గురించి మీకు పూర్తి అవ‌గాహ‌న క‌లిగి ఉంటే.. మీ విజ‌యాన్ని ఎవ్వ‌రూ ఆప‌లేరు. తాను చేస్తున్న ప‌ని మాత్ర‌మే కాకుండా అన్ని విష‌యాల‌పై ప‌రిజ్ఞానం ఉన్న వ్య‌క్తి జీవితంలో కూడా క‌చ్చితంగా విజ‌యం సాధిస్తాడు.

ఆత్మ‌విశ్వాసం

విజ‌యం సాధించాలంటే మ‌నిషికి ఆత్మ‌విశ్వాసం ఎంతో ముఖ్యం. మీరు విజ‌యం సాధించాల‌నుకుంటే.. మీ ఆత్మ‌విశ్వాసాన్ని ఎప్ప‌టికి దిగ‌జార్చుకోకండి. ఆత్మ‌విశ్వాసం క‌లిగిన వ్య‌క్తి విజ‌యాన్ని ఎవ్వ‌రూ కూడా అడ్డుకోలేరు.

డ‌బ్బును పొదుపు చేయ‌డం

Advertisement


ముఖ్యంగా డ‌బ్బును పొదుపు చేయ‌డం చాలా క‌ష్ట‌మైన ప‌ని అనే చెప్పాలి. అందుకే చాలా మంది డ‌బ్బు సంపాదించ‌డం కంటే దాచ‌డం చాలా క‌ష్టం. చాణ‌క్య నీతి ప్ర‌కారం.. మ‌నిషి జీవితంలో ఎదుర‌య్యే క‌ష్టాల‌ను ఎదుర్కోవ‌డానికి ముందుగానే డ‌బ్బును ఏర్పాటు చేసుకోవాలి. పొదుపు అలవాటైన వ్య‌క్తి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు.

క‌ష్ట‌ప‌డి ప‌ని చేయ‌డం

కష్ట‌ప‌డ‌నిది ఏది సాధించ‌లేము. చాణ్య నీతి కూడా క‌ష్ట‌ప‌డితే ఏదైనా సాధించ‌వ‌చ్చ‌ని చెబుతుంది. విజ‌య‌వంతుడిగా మార‌డానికి క‌ష్ట‌ప‌డి ప‌ని చేయ‌డం చాలా ముఖ్యం. క‌ష్ట‌ప‌డి ప‌ని చేసే వారిని విజ‌యం అంటిపెట్టుకుని ఉంటుంది.

చ‌క్క‌ని వ్యూహం

chanakya-nithi-telugu

chanakya-nithi-telugu

చాణ‌క్య నీతి ప్ర‌కారం.. చ‌క్క‌ని వ్యూహంతో ముందుకు సాగే వ్య‌క్తి ప్ర‌తీ క‌ష్టాన్ని చాలా సుల‌భ‌ముగా అధిగ‌మిస్తాడు. అదుకే మ‌నిషి ఏదైనా ప‌నిని ప్రారంభించే ముందు ప‌టిష్ట‌మైన వ్యూహాన్ని రూపొందించుకుని అందుక‌నుగుణంగా న‌డుచుకోవాలి.

ఇవి కూడా చదవండి :

  1. ప్రభాస్ యష్ లతో మల్టీ స్టారర్..!
  2. KGFలో అందుడిగా నటించిన తాత ఎవరో తెలుసా….ఆయన బ్రాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు….!
  3. Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆటంకాలు పెర‌గ‌కుండా చూసుకోవాలి

Visitors Are Also Reading