Home » ప్రభాస్ యష్ లతో మల్టీ స్టారర్..!

ప్రభాస్ యష్ లతో మల్టీ స్టారర్..!

by AJAY
Ad

బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఈ సినిమా ఆ తరవాత ప్రభాస్ అంతే ఇండియా లో తెలియని ప్రేక్షకులు ఉండరు. ఇక కేజీఎఫ్ సినిమాతో యష్ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. దాంతో యశ్ క్రేజ్ కూడా పెరిగిపోయింది. ఇక ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో సలార్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇక కేజీఎఫ్ విజయం తో ఈ సినిమా పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు అభిమానులు ఓ కొత్త కోరిక కోరుతున్నారు. పాన్ ఇండియా స్టార్ లుగా ఉన్న ప్రభాస్ యశ్ కలిసి ఓ సినిమా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Advertisement

అంతే కాకుండా ఈ సినిమా కేజీఎఫ్ సలార్ ల కొనసాగింపు కథగా ఉంటే బాగుంటుందని బావిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్స్ ను ట్రెండ్ చేస్తున్నారు. అయితే సినిమా ఎలా చేయాలి అన్నది దర్శకుడు రాసుకున్న కథ పై బేస్ అయ్యి ఉంటుంది. మరి ప్రశాంత్ నీల్ అభిమానుల కోరికను నెరవేరుస్తారో లేదో చూడాలి.

Also read : ఎన్టీఆర్ ఎలివేషన్ సీన్ డిలీట్…జక్కన్న పై ఫ్యాన్స్ ఫైర్ …!

Visitors Are Also Reading