Home » KGFలో అందుడిగా నటించిన తాత ఎవరో తెలుసా….ఆయన బ్రాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు….!

KGFలో అందుడిగా నటించిన తాత ఎవరో తెలుసా….ఆయన బ్రాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు….!

by AJAY
Ad

కన్నడ స్టార్ హీరో యష్ నటించిన కేజిఎఫ్ సినిమా సంచలనాలు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్ గా కేజిఎఫ్ 2ను ఇటీవలే విడుదల చేశారు. కేజీఎఫ్-2 కూడా పాన్ ఇండియా లెవల్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాకు బాలీవుడ్లోనూ కలెక్షన్ల వర్షం కురుస్తోంది. కన్నడ సినిమా ఈ రేంజ్ లో క్రేజ్ సంపాదించడం ఇదే మొదటిసారి. ఇక ఈ సినిమాలో ప్రతీ పాత్ర హైలెట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దాంతో సినిమాలో నటించిన నటీనటులకు కు ప్రశంసలు అందుతున్నాయి.

అంతేకాకుండా ముఖ్యమైన పాత్రలలో నటించిన వారి వివరాలను ప్రేక్షకులు తెలుసు కోవాలని ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కాబట్టి ఈ సినిమాలో అందుడి పాత్రలో కనిపించిన నటుడు ఎవరు…? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే వివరాలను తెలుసుకుందాం. కేజిఎఫ్ సినిమా లో అందుడి గా నటించిన ముసలాయన పేరు కృష్ణాజీ. ఈయన ఆంధ్ర కర్ణాటక బార్డర్ కు చెందిన వారు. సినిమాలపై ఆసక్తితో చిన్ననాటి నుండి ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలు చూస్తూ కృష్ణాజీ పెరిగారు.

Advertisement

Advertisement

తాను కూడా సినిమాల్లోకి రావాలని కృష్ణాజి కలలు కన్నారు. ఈ నేపథ్యంలోనే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేరి నటన కూడా నేర్చుకున్నారు. ఆ తర్వాత అవకాశాలు కోసం వెతికి అలసిపోయారు. కొంతకాలం సినిమా వాళ్లకు దుస్తులు కుట్టే పని కూడా చేశారు. కృష్ణాజీ కి భీమ్ వెంకటేష్ అనే హీరో కమ్ ప్రొడ్యూసర్ తో పరిచయం ఏర్పడింది.

దాంతో ఆయన వద్ద కొంతకాలం పని చేశారు. ఆ తర్వాత కమల్ హాసన్ మేకప్ బాయ్ తో పరిచయం ఏర్పడగా ఆయన వద్ద టచప్ బాయ్ గా పనిచేశాడు. ఆ తర్వాత శంకర్ నాగ్ దగ్గర కృష్ణాజీ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. అలా శంకర్ నాగ్ దగ్గర పనిచేస్తున్న సమయంలో లో కృష్ణాజి కి కేజిఎఫ్ లో నటించే అవకాశం వచ్చింది. అలా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించి కృష్ణాజి ప్రశంసలు అందుకున్నారు.

Also read :

బాలయ్యకు జోడిగా మంజుల నటిస్తే ఆత్మహత్య చేసుకుంటామన్నారు….అప్పట్లో సంచలనం సృష్టించిన వార్త….!

ఎన్టీఆర్ ఎలివేషన్ సీన్ డిలీట్…జక్కన్న పై ఫ్యాన్స్ ఫైర్ …!

Visitors Are Also Reading