బుల్లితరపై యాంకర్ లు గా రానించిన చాలా మంది సినిమాలలోనూ రానిస్తున్నారు. మఖ్యంగా యాంకర్ అనసూయ అయితే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అనసూయ రంగస్థలంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా పుష్పతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక పుష్ప పార్ట్ 2లో లీడ్ రోల్ లో నటించబోతుంది. అంతే కాకుండా యాంకర్ రష్మి కూడా గుంటూరు టాకీస్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.
Advertisement
ప్రస్తుతం టీవీ షోలు చేస్తూనే అడపాదడపా సినిమాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే యాంకర్ శ్రీముఖి కూడా గతంలో సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. జులాయి సినిమాలో శ్రీముఖి అల్లు అర్జున్ కు చెల్లిగా నటించింది. ఇక ఆ తరవాతే యాంకర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరవాత కూడా కొన్ని సినిమాలు చేసిన శ్రీముఖి కొంతకాలనికి సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. ఆఫర్లు వచ్చినా వాటిని రిజెక్ట్ చేయడం మొదలు పెట్టింది.
Advertisement
కాగా తాను సినిమాలకు గుడ్ బై చెప్పడానికి గల కారణాన్ని శ్రీముఖి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. జులాయి సినిమా చేస్తున్న సమయంలోనే తన తండ్రి సినిమాలు వద్దని హెచ్చరించినట్టు తెలిపింది. ఆ సినిమానే ఫస్ట్ అండ్ లాస్ట్ అని ఆర్డర్ వేశారని చెప్పింది. అయినప్పటికీ నాన్న మాట వినకుండా రెండు మూడు సినిమాలు చేసి మానేశానని చెప్పింది.
ఆ తరవాతనే టీవీ షోలు చేయడం ప్రారంభిచినట్టు తెలిపింది. టీవీ షోలు చేస్తున్న సమయంలో రెండు మూడు సినిమా ఆఫర్ లు వచ్చాయని కానీ ఎక్స్ పోజింగ్ చేయాలని లిప్ లాక్ సీన్లు ఉంటాయని చెప్పారని తెలిపింది. దాంతో తాను నో చెప్పి టీవీ షోలతోనే బిజీ అయ్యానని తెలిపింది. ఇప్పుడు సినిమాల గురించి ఆలోచించే తీరక కూడా లేదని చెప్పుకొచ్చింది.
ALSO READ :
స్వయంకృషి సినిమా ఎఫెక్ట్…. చెప్పులషాపుల పేరు మార్చిన యజమానులు..!
నాగార్జున అలా అనడంతో కృష్ణ ఫ్యాన్స్ కొట్టడానికి వచ్చారట..అసలేం జరిగిదంటే..!