Home » నాగార్జున అలా అన‌డంతో కృష్ణ ఫ్యాన్స్ కొట్ట‌డానికి వ‌చ్చార‌ట‌..అస‌లేం జ‌రిగిదంటే..!

నాగార్జున అలా అన‌డంతో కృష్ణ ఫ్యాన్స్ కొట్ట‌డానికి వ‌చ్చార‌ట‌..అస‌లేం జ‌రిగిదంటే..!

by AJAY
Ad

మల్టీస్టారర్ వచ్చినప్పుడు కాస్త తేడా వచ్చినా హీరోల అభిమానులు హర్ట్ అవుతారు. రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ విషయంలోనూ అదే జరిగింది. రామ్ చరణ్ కంటే ఎన్టీఆర్ పాత్ర నిడివి త‌క్కువగా ఉంది. పాత్ర‌కు ప్రాధాన్య‌త కూడా త‌క్కువ ఉందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు రాజమౌళి పై ట్రోల్స్ కూడా చేస్తున్నారు. కొంత‌మంది అయితే ఏకంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు నెగిటివ్ ప్ర‌చారం కూడా మొద‌లు పెట్టారు.

Advertisement

అంతే కాకుండా ఆ కోపంతో ఆర్ఆర్ఆర్ కంటే కేజీఎఫ్ పెద్ద హిట్ అంటూ ప్ర‌చారం చేయ‌డం మ‌రో విడ్డూరం. నిజానికి స్టార్ హీరోలు మల్టీస్టారర్ లో నటిస్తే ఇలాంటి తిప్పలు తప్పవు. అయితే ఇలాంటి గొడవలు ఇప్పుడే కాదు….. ఒకప్పుడు కూడా జరిగాయి. సూపర్ స్టార్ కృష్ణ నాగార్జున హీరోలుగా వారసుడు అనే సినిమా తెరకెక్కింది. ఈ చిత్రానికి మురళీమోహన్ నిర్మాతగా వ్యవహరించారు.

Advertisement

కాగా ఈ సినిమా సమయంలో జరిగిన ఓ గొడవ గురించి మురళీమోహన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. వారసుడు సినిమాలో ఒక సందర్భంలో కృష్ణ నాగార్జునతో నువ్వెంత అంటూ వాదించడం జరుగుతుందని చెప్పారు. ఆ సీన్లో నాగార్జున కృష్ణ ను పట్టుకుని వాదిస్తూ మాట్లాడతారని తెలిపారు. అయితే ఈ సన్నివేశం కారణంగా సినిమా విడుదలైన తర్వాత కృష్ణ అభిమానులు తన తో గొడవ పడ్డారని చెప్పారు.

సినిమా లోని తన పాత్ర చాలా నచ్చడంతో కృష్ణ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అన్నారు. అంతేకాకుండా కృష్ణ గొప్ప మనసున్న హీరో అని తెలిపారు. సినిమా ఫ్లాప్ అయితే నిర్మాతలను ఆదుకునే విషయంలో కృష్ణ అందరి కంటే ముందు ఉంటానని చెప్పారు. నిర్మాత దగ్గర డబ్బులు లేకపోయినా కృష్ణ అండగా నిలబడి సహాయం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు.

ALSO READ : 

సీనియ‌ర్ హీరోల‌కు బుర్ర‌లేదా అంటూ ఉద‌య్ కిర‌ణ్ ఫైర్…డైరెక్ట‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.!

స్వ‌యంకృషి సినిమా ఎఫెక్ట్…. చెప్పుల‌షాపుల పేరు మార్చిన య‌జ‌మానులు..!

 

Visitors Are Also Reading