మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటించారు. సినిమాలో చిరంజీవికి హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించగా రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ ను విడుదల చేయగా ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేయనున్నారు.
Advertisement
నిజానికి సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇక సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆచార్య టీమ్ ప్రమోషన్స్ లో బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఏప్రిల్ 23 నిర్వహించనున్నారు. విజయవాడలో ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నట్టు సమాచారం అందుతోంది.
Advertisement
అంతే కాకుండా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు సీఎం జగన్ ను ముఖ్యఅతిధిగా రావాలని చిరంజీవి ఆహ్వానించినట్టు సమాచారం. చిరు జగన్ ల మధ్య మంచి సన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. ఏపీ టికెట్ల అంశం పై కూడా చిరంజీవి చొరవతోనే సీఎం జగన్ కొత్త జీవోను తీసుకువచ్చారు. అయితే ఆచార్య ప్రిరీలీజ్ ఈవెంట్ కు సీఎం జగన్ వస్తుండటంతో ఆయనకు వ్యతిరేఖంగా ఏపీలో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ వస్తున్నరా లేదా అన్నది ప్రశ్నగా మారింది.
అంతే కాకుండా నాగబాబు కూడా వస్తారా లేదా అన్న ఆసక్తి మొదలైంది. ఇదిలా ఉంటే ప్రీరిలీజ్ ఈవెంట్ పవన్ కల్యాణ్ స్లోగన్స్ తో మారుమ్రోగాలని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతే కాకుండా ఏం చేయాలి..? ఏం చేయకూడదు అంటూ ఓ లిస్టును కూడా రెడీ చేస్తున్నారు. దాంతో ఆచార్య ఈవెంట్ ఎలా జరుగుతుంది అన్నదానిపై ప్రేక్షకులకు ఆసక్తి పెరిగిపోతోంది.
ALSO READ :
పెళ్లి తరవాత ఎఫైర్ లు ఎందుకు పెట్టుకుంటారు..? 5 కారణాలు ఇవే..!
విశాఖ వాసులకు గుడ్‌న్యూస్.. అత్యంత త్వరలోనే మెట్రోరైలు