Home » విశాఖ వాసుల‌కు గుడ్‌న్యూస్‌.. అత్యంత త్వ‌ర‌లోనే మెట్రోరైలు

విశాఖ వాసుల‌కు గుడ్‌న్యూస్‌.. అత్యంత త్వ‌ర‌లోనే మెట్రోరైలు

by Anji
Ad

విశాఖ ప్ర‌జ‌ల‌కు శుభ‌వార్త అందింది. విశాఖ మ‌హాన‌గ‌రానికి త్వ‌ర‌లో మెట్రోరైలు రానున్న‌ది. ఈ మేర‌కు 76 కిలోమీట‌ర్ల ప‌రిధిలో మెట్రోరైలు వ్య‌వ‌స్థ‌ను నిర్మించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు ఏపీ మెట్రోరైలు కార్పొరేష‌న్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ యూజేఎం రావు వెల్ల‌డించారు.

Advertisement

విశాఖ‌లో మెట్రోరైలు ప్రాజెక్టుపై శ‌నివారం మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టు ఐదేళ్లలో పూర్తి అవుతుంద‌ని చెప్పారు యూజేఎంరావు. మొత్తం 54 మెట్రో స్టేష‌న్ లు, రెండు డిపోలు నిర్మిస్తున్న‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు. మెట్రోరైలు ప్రాజెక్టు ఏర్పాటుకు హై ప‌వ‌ర్ క‌మిటీ ఏర్పాటు చేసిన‌ట్టు ఏపీ మెట్రోరైలు కార్పొరేష‌న్ ఎండీ యూజేఎంరావు వివ‌రించారు.

Advertisement

హైప‌వ‌ర్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో రూ.14,309 కోట్ల వ్య‌యంతో మెట్రోరైలు ప్రాజెక్టు అంచ‌నాలు రూపొందించిన‌ట్టు వెల్ల‌డించారు. మెట్రోరైలు ప్రాజెక్టు నేప‌థ్యంలో స్థానికుల స్థ‌లాల‌కు, భ‌వ‌నాల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్మాణం జ‌రిగేవిధంగా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు స్ప‌ష్టం చేసారు. విశాఖ‌లో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ కార‌ణంగా రోడ్ల‌పై ప్ర‌యాణం చేయాలంటే ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. మెట్రోరైలు ప్రాజెక్టు రాక‌తో ప్ర‌యాణికుల క‌ష్టాలు మ‌రొక ఐదేళ్ల‌లో తీరనున్నాయి.

ఇవి కూడా చదవండి :

1.Chanakya Niti : పిల్ల‌లు జీవితంలో విజ‌యం సాధించాలంటే.. త‌ల్లిదండ్రులు ఈ విష‌యాల‌ను పాటించాలి

2. ఐపీఎల్ or లవర్ : మీ సమాధానం ఏంటి..?

3.టీంఇండియాకు కాబోయే కెప్టెన్ అతనే…?

Visitors Are Also Reading