గ్వాటేమాల దీవిలో అదొక చిన్న గ్రామం. టోడోస్ సాంతోస్ అనే ఊరు. అక్కడ నివసించే స్థానిక ప్రజలను మయన్లు అని పిలుస్తారు. అక్కడ ప్రతీ నవంబర్ 01వ తేదీన ఓ వింత పోటీ జరుగుతుంది. పందెం జరిగే ముందు రాత్రి అనగా అక్టోబర్ 31న క్వెట్టా లెట్కా అనే పేరు గల మద్యం సేవిస్తారు. ఆ మత్తులోనే ఉదయం పోటీలో పాల్గొంటారు. ఈ పోటీలో పాల్గొనే సాంప్రదాయం ఎందుకొచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
17వ శాతాబ్దంలో స్థానిక మయన్ ప్రజల మీద స్పానిష్ సైన్యం విజయం సాధించిన సందర్భంగా ఓ నిబంధన పెట్టారు. అదిఏమిటంటే.. గుర్రాల స్వారీలో అత్యంత నిపుణులు అయిన మయన్లు ఇక నుంచి గుర్రాల స్వారీ చేయకూడదు అని.. అది నచ్చని మయన్లు పంతం కొద్ది తాగి గుర్రాలను నడపసాగారు. చివరికీ ఇలా పోటీగా మారింది. తాగిన మత్తులో వాళ్లు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వెళ్లాలి. ఈ రేస్‌కు సంబంధించి ఎలాంటి నియమ, నిబంధనలుండవు.
Also Read : సీనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా కృష్ణ చేసిన 5 సినిమాలు ఇవే..!
Advertisement
ఈ పోటీకి మరింత ఆదరణ తెచ్చేందుకు సుమారు 7 గంటల పాటు జరిగే ఈ పోటీలో ఎవరు ఎంత సేపు అయినా పాల్గొనవచ్చు. గుర్రాలపై గంటట పాటు స్వారీ చేస్తూనే ఉంటారు. మత్తు మరీ ఎక్కువైతే గుర్రాల మీద వాలిపోయి కింద పడిపోతూ ఉంటారు. కింద పడిన వారికి దెబ్బలు తగలడం అక్కడ సహజమే. ఒక్కోక్కసారి ప్రాణాలు కూడా పోతుంటాయి. ఈ పోటీలలో పాల్గొనేందుకు కేవలం మగవారికి మాత్రమే అనుమతి ఉంటుంది. అదేవిధంగా ఆడవాళ్లకు, చిన్న పిల్లలు పోటీలో పాల్గొనడానికి అనర్హులు. ఆసక్తికరమైన ఈ పోటీలో గెలిచిన విజేతకు ఓ కోడిని బహుకరిస్తారు.
ఈ పోటీల్లో లాభపడేది గుర్రాల యజమానులు. ఈ పోటీల సమయంలో గుర్రాలను అద్దెకు ఇవ్వడం ద్వారా భారీ మొత్తంలో డబ్బు సంపాదిస్తారు. ఒక గుర్రాలకు గాయపడిన పోటీ నిర్వాహకులు వాటికి ఉచితంగా వైద్యం చేయిస్తారు. అందుకు తగినంత ఖర్చులు చేస్తారు. అందువల్ల స్థానిక గుర్రపు యజమానులు మాత్రమే కాకుండా పోటీ నాటికి వేరే ప్రాంతాల్లో ఉన్న వారు కూడా తమ గుర్రాలతో ఇక్కడికి వచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడ విచిత్రమేమిటంటే ఆ గ్రామంలో పోటీ జరిగే ఒక్కరోజు మాత్రమే మద్యం సేవిస్తారట. ఆ తరువాత అస్సలు మందు జోలికి వెళ్లరట. ఎంతో ఆసక్తికరమైన పోటీలు చూడాలంటే గ్వాటేమాల దేశానికి వెళ్లాల్సిందే..!
Also Read : సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సైమన్ కటీచ్ వీడ్కోలు..!