మైక్రోసాప్ట్ సహ వ్యవస్థాపకుడు, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ హిలాల్ ఏ పాకిస్తాన్ అవార్డుగా పాకిస్తాన్ ప్రకటించింది. పేదరిక నిర్మూలన ఆరోగ్య సంరక్షణ కోసం పర్యటనలో బిల్ గేట్స్‌కు పాకిస్తాన్ అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్ అల్వీ ఈ అవార్డును ప్రదానం చేశారు.
Also Read : చరణ్ ను నాకు ఇచ్చినందుకు థాంక్స్….సురేఖపై ఉపాసన ఎమోషనల్ పోస్ట్..!
ఇవాళ ఇస్లామాబాదా్ లోని ఐవాన్ ఏ సదర్‌లో ప్రత్యేక అలంకరణ వేడుక నిర్వహించారు. 2010లో బిల్ అండ్ మెలిండా ఫౌండేషన్ గ్లోబల్ హెల్త్ కమ్యూనిటీ సవాలును పరిష్కరించడానికి టీకాల దశాబ్దంగా ప్రకటించింది. రాబోయే 10 ఏండ్లలో పరిశోధనకు సాయం చేయడానికి 10 బిలియన్ డాలర్లకు బిల్ గేట్స్ హామి ఇచ్చారు.
ముఖ్యంగా పాకిస్తాన్ కు చెందిన ప్రీమియర్ యాంటి కరోనా వైరస్ సంస్థ నేషనల్ కమాండ్ అండ్ ఆపరేషన్ సెంటర్ సెషన్‌కు గేట్స్ హాజరయ్యారు. ప్రణాళిక మంత్రి, NCOC చీఫ్ అసద్ ఉమర్‌తో కూడా భేటీ అయ్యారు. NCOC గురించి దేశంలోని కరోనా వైరస్ పరిస్థితి నాన్ ఫార్మాస్యూటికల్ సంస్థల ద్వారా కరోనా నియంత్రించే ప్రయత్నాల గురించి బిల్ గేట్స్ ఆరా తీశారు. పాకిస్తాన్‌లో గుర్తించిన జీనోమ్ సీక్వెన్సింగ్ కరోనా వైరస్ వేరియంట్‌ల గురించి కూడా పాక్ NCOC నిర్వాహకులు బిల్ గేట్స్‌కు సమాచారం అందించారు. అసద్ ఉమర్ తరువాత NCOC వద్ద గేట్స్‌ను హోస్ట్ చేయడం గురించి ట్వీట్ చేసారు. పోలియో తీవ్రమైన సమస్యగా ఉన్న ప్రపంచంలో మిగిలిన రెండు దేశాల్లో పాకిస్తాన్ ఒకటి.
ఇదిలా ఉండగా పాక్ ప్రధాని ఇమ్రాన్ మైక్రోసాప్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గత కొన్నేళ్లుగా టచ్‌లో ఉన్నారు. ఇద్దరూ ఏప్రిల్ 2021లో టెలిఫోనిక్ సంభాషణ కూడా చేసారు. కరోనా ప్రతిస్పందన, పోలియో నిర్మూలన, వాతావరణ మార్పుల గురించి చర్చించారు. ఇందుకు సంబంధించి మైక్రోసాప్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ తరుపున బిల్ గేట్స్ నిధులు అందిస్తున్నారు. 2017 లో ఫౌండేషన్ ఆఫ్రికా ఆసియాలో వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కునే రైతులకు సాయం చేయడానికి 300 మిలియన్ డాలర్లను ప్రతిజ్ఞ చేసింది. 2020లో ఫౌండేషన్ దాదాపు 300 మిలియన్ డాలర్లను కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా ప్రచారానికి మద్దతు ఇచ్చింది.
Also Read : పుష్ప సినిమా లో ఈ మిస్టేక్ గమనించారా ?