Telugu News » చ‌ర‌ణ్ ను నాకు ఇచ్చినందుకు థాంక్స్….సురేఖ‌పై ఉపాస‌న ఎమోష‌న‌ల్ పోస్ట్..!

చ‌ర‌ణ్ ను నాకు ఇచ్చినందుకు థాంక్స్….సురేఖ‌పై ఉపాస‌న ఎమోష‌న‌ల్ పోస్ట్..!

by AJAY MADDIBOINA

టాలీవుడ్ లోని అంద‌మైన జంటల్లో రామ్ చ‌ర‌ణ్ ఉపాస‌నల జంట కూడా ఒక‌టి. చ‌రణ్ త‌న చిన్న‌నాటి స్నేహితురాలైన ఉపాస‌న‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ వైవాహిక జీవితాన్ని ఎంత‌గానో ఆస్వాదిస్తున్నారు. చ‌ర‌ణ్ సినిమాల‌తో బిజీగా ఉండ‌గా ఉపాస‌న అపోలో ఆస్ప‌త్రి బాధ్య‌త‌లు ఇత‌ర వ్యాపారాలు చూసుకుంటారు.

Ads

ALSO READ : BANGARRAJU : బంగార్రాజులో ఉట్టికొట్టిన ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా….?

అయితే ఇద్దరికీ స‌మయం దొరికిన‌ప్పుడ‌ల్లా విహార‌యాత్ర‌ల‌కు వెళుతూ ఎంజాయ్ చేస్తారు. దానికి సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేస్తూ ఉంటారు. అదే విధంగా ఉపాస‌న‌ను చ‌ర‌ణ్ కుటుంబ స‌భ్యులు కూడా ఎంతగానో ఇష్ట‌ప‌డుతుంటారు. ఉపాస‌న కూడా చ‌ర‌ణ్ ఫ్యామిలీపై ఎంతో ప్రేమ‌ను చూపిస్తూ ఉంటారు. ఇదిలా ఉండ‌గా నేడు రామ్ చ‌ర‌ణ్ త‌ల్లి సురేఖ పుట్టిన‌రోజును జ‌రుపుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలో ప‌లువురు ప్ర‌ముకులు మెగా ఫ్యామిలీ మెంబ‌ర్స్ సురేఖ‌కు పుట్టిన‌రోజు శుభాంకాంక్ష‌లు చెబుతున్నారు. రామ్ చ‌ర‌ణ్ త‌న తండ్రి త‌ల్లితో క‌లిసి ఆచార్య సినిమా సెట్స్ లో దిగిన ఫోటోను షేర్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పారు. కాగా ఉపాస‌న కూడా ఓ బ్యూటిఫుల్ ఫోటోను షేర్ చేసి త‌న అత్త‌గారికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పారు. ఈ ఫోటోలో రామ్ చ‌ర‌ణ్ ఉపాస‌న తో పాటూ సురేఖ ఉన్నారు.

ఇక ఈ ఫోటోకు ఉపాస‌న నా ప్రియ‌మైన అత్త‌గారికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు…మా వైవాహిక జీవితంలో మీరెంతో ముఖ్య‌మైనవారు. రామ్ చ‌ర‌ణ్ ను నా జీవితంలో భాగం చేసినందుకు కృతజ్ఞ‌త‌లు. మిమ్మ‌ల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను…అంటూ ఉపాస‌న త‌న పోస్ట్ లో పేర్కొన్నారు.


You may also like