Telugu News » Blog » పుష్ప సినిమా లో ఈ మిస్టేక్ గమనించారా ?

పుష్ప సినిమా లో ఈ మిస్టేక్ గమనించారా ?

by AJAY
Ads

టాలీవుడ్ లేటెస్ట్ సూపర్ హిట్ సినిమా పుష్ప. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా థియేటర్లలో కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రాన్ని టాలెంటెడ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించారు. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా సునీల్, అనసూయ, మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలలో నటించారు. ఇక ఇటీవలే ఈ సినిమా ఓటీటీలో విడుదల కాగా అక్కడ కూడా తగ్గేదేలా అంటూ వ్యూవ్స్ ను సంపాదిస్తుంది. ఇదిలా ఉంటే దర్శకులు ఎంతో కష్టపడి సినిమాలు చేస్తారు. ఇక టాలీవుడ్ లో మిగతా దర్శకుల కంటే ఎక్కువ లాజిక్స్ సుకుమార్ సినిమాలోనే కనిపిస్తూ ఉంటాయి.

Advertisement

pushpa

pushpa

ఎన్నో లాజిక్స్ చూపించే దర్శకులు అయినా కొన్ని సార్లు పప్పులో కాలెయ్యక తప్పదు. తాజాగా అదే మిస్టేక్ పుష్ప సినిమాలో జరిగింది. ఈ సినిమాలో సుకుమార్ చిన్న లాజిక్ ను మిస్ అయ్యారు. ఇప్పుడు అది కాస్తా ప్రేక్షకులకు దొరికిపోయింది. దాంతో సోషల్ మీడియాలో ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు సార్ అంటూ మీన్స్ వస్తున్నాయి.

Advertisement

ఆ చిన్న మిస్టేక్ ఏంటో ఇప్పుడు చూద్దాం…. సినిమాలో అల్లు అర్జున్ కు స్నేహితుడు కమ్ పీఏ గా కేశవ అనే పాత్రలో జగదీష్ నటించాడు. అయితే మొదటి సారి అల్లు అర్జున్ కేశవ తో కలిసి కార్ ఎక్కుతాడు. ఆ కార్ దిగినప్పుడు డోర్ ఎలా తీయాలో తెలియక కేశవ సతమతమవుతాడు దాంతో మరో వ్యక్తి వచ్చి కార్ డోర్ ఓపెన్ చేస్తాడు.

Advertisement

Also read : టాలీవుడ్ లో కరోనా టెర్రర్…మరో నటుడికి పాజిటివ్…!

కట్ చేస్తే ఆ తర్వాత అల్లు అర్జున్ కు ఐదు లక్షలు రావడంతో వెంటనే కార్ కొనేస్తాడు. తనకు వచ్చిన డబ్బును కేశవ కు ఇచ్చి కార్ కొనుక్కుని రావాలని చెప్పి పంపిస్తాడు. దాంతో ఆ డబ్బు తీసుకెళ్లి కేశవ కార్ కొనుక్కొని డ్రైవింగ్ చేస్తూ మరీ వస్తాడు. ఇక్కడే సుకుమార్ పప్పులో కాలేశాడు. కనీసం కార్ డోర్ తెరవడం రాని కేశవ…. కార్ కొనుక్కుని ఎలా నడుపుకుంటూ వచ్చాడని మీమర్స్ క్వశ్చన్ చేస్తున్నారు. దానికి నెటిజన్లు సైతం నిజమే కదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.